ఆ ధైర్యం దిల్‌ రాజుకే సాధ్యం: అల్లు అరవింద్‌ | Allu Aravind Interesting Comments On Dil Raju In Love Me Movie Pre Release Event, Deets Inside | Sakshi
Sakshi News home page

Allu Aravind: ఆ ధైర్యం దిల్‌ రాజుకే సాధ్యం

Published Fri, May 24 2024 6:53 AM | Last Updated on Fri, May 24 2024 10:45 AM

Allu Aravind Comments On Dil Raju

ఆశిష్‌, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్‌ మీ. ఇఫ్‌ యు డేర్‌ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు.  తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్​ రాజు గురించి ఆసక్తరమైన విషయాలను పంచుకున్నారు.

లవ్‌ మీ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసే అవకాశాన్ని అరుణ్‌కు దక్కడం చాలా సంతోషం అని అల్లు అరవింద్‌ అన్నారు. కొత్తవారికి దర్శకత్వం వహించే ఛాన్సులు ఎక్కువగా దిల్‌ రాజు ఇస్తుంటారని ఆయన గుర్తు చేశారు. డైరెక్షన్‌లో గత అనుభవం​ లేని వారికీ అవకాశాలు ఇవ్వడం దిల్‌ రాజుకే సాధ్యమని అల్లు అరవింద్‌ తెలిపారు. అలాంటి సాహసం తాను ఏమాత్రం చేయలేనని ఆయన అన్నారు. లవ్‌ మీ సినిమాతో కీరవాణి, పీసీ శ్రీరామ్‌లాంటి స్టార్ టెక్నిషియన్లతో మొదటి ప్రాజెక్ట్‌కే పని చేయడం అరుణ్‌ అదృష్టమని తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆరవింద్‌ ఆశించారు.

దిల్​ రాజు మాట్లాడుతూ..'హర్షిత్‌ రెడ్డి సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారాడు. హన్షిత చిన్నప్పటినుంచి షూటింగ్స్‌కు వెళ్లేది. కానీ సినిమా రంగంలోకి వస్తుందని ఊహించలేదు. వీరిద్దరు కలిసి దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్నారు. తొలి సినిమా బలగంతో వేణు యెల్దండిని దర్శకుడిగా పరిచయం చేశారు. లవ్‌ మీతో అరుణ్‌కు ఛాన్స్‌ ఇచ్చారు. మరికొన్ని సినిమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. కొత్తవారిని ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం' అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement