
ఈ ఏడాది అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీకి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ఏకంగా రూ. 21.27 కోట్లు రాబట్టింది. విడుదలైన వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అలరిస్తోంది. వందకోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో శ్రీకాకుళంలో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన జీవితాన్ని సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'మల్లయోధుడు కోడి రామ్మూర్తి గారి స్డేడియంలో మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆయన గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు. కానీ వారిని స్మరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రిత పుట్టి ప్రపంచప్రఖ్యాతి గాంచారు. ఈ జిల్లాకు ఎన్నో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. నేను ఆయన చరిత్ర చదివినప్పుడు వెబ్ సిరీస్‌గా తీయాలని అనుకున్నాం. నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే రెండు కార్లను చేతులతో ఆపిన ఆయన కేవలం శాఖాహారి' అని తన మనసులో మాటను పంచుకున్నారు. శాకాహారి అయిన ఆయన శారీరక ధారుఢ్యంలో ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment