Vaishnavi Chaitanya's Next Film With Geetha Arts - Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: టాప్‌ బ్యానర్‌లోకి వైష్ణవి చైతన్య.. హీరో ఎవరంటే

Published Sun, Jul 23 2023 11:23 AM | Last Updated on Sun, Jul 23 2023 12:06 PM

Vaishnavi Chaitanya Next Film With Geetha Arts - Sakshi

బేబీ హీరోయిన్‌ 'వైష్ణవి చైతన్య' పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్‌లో ఉంది. టాలీవుడ్‌లో హీరోయిన్‌ కావాలనే లక్ష్యంతో పరిశ్రమకొచ్చి. ఎనిమిదేళ్లైనా అది నెరవేరకపోవడంతో యూట్యూబర్‌గా అయినా కొనసాగాలని పలు షార్ట్‌ ఫిలిమ్స్‌ తీసుకుంటూ.. ఇన్‌స్టాలో రీల్స్‌ చేసుకుంటూ ఉంటున్న తనకు  డైరెక్టర్‌ సాయిరాజేశ్‌ వల్ల బేబీతో సిల్వర్‌ స్క్రీన్‌పై మొదటిసారి మెరిసింది. వచ్చిన అవకాశం నిలబెట్టుకునేందకు తను కూడా ఎంతగానో కష్టపడింది కూడా. 

(ఇదీ చదవండి: నో డౌట్‌.. ఈ కామన్‌ మహిళ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఖాయం)

మొదట కథ విన్నప్పుడు  ఒక బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తావని డైరెక్టర్‌ చెప్పినప్పుడు ఎగిరి గంతేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చెప్పింది. ఎందుకంటే తాను కూడా చాంద్రాయణగుట్టలోని ఒక బస్తీ అమ్మాయినే కాబట్టి అంటూ తన ఐడెంటీని దాచుకోకుండా చెప్పుకొచ్చింది. దీంతో  ఒక తెలుగమ్మాయి టాలెంట్‌కు  దక్కాల్సిన ఫేమ్‌ తనకు వచ్చింది.

(ఇదీ చదవండి: నీకు కృతజ్ఞతే లేదు.. బన్నీని ముందు పెట్టి మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్‌)

తాజాగా వైష్ణవి టాలీవుడ్‌లో ప్రముఖ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తనను అల్లు అరవింద్‌ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధంచి స్టోరీ కూడా తన వద్ద ఉందని, అది కూడా ఫీమేల్‌ ఓరియేంటేడ్‌ అని బేబీ సక్సెస్‌ మీట్‌లోనే అల్లు అరవింద్‌ కొంతమేరకు లీకులు ఇచ్చారు. మరోవైపు అల్లు శిరీష్‌- వైష్ణవి జంటగా మరో స్టోరీతో కూడా మూవీని ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. అల్లు అర్జున్‌ కూడా బేబీలో వైష్ణవి నటనకు ఫిదా అయ్యానని ఓపెన్‌గానే చెప్పాడు. అల్లు కుటుంబం నుంచి తనకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి. ఎదో ఒక ప్రాజెక్ట్‌లో గీతా ఆర్ట్స్‌ ద్వారా తన జర్నీలో మరో అడుగు పడటం ఖాయమని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement