Rakt Bramhand: తెలుగు డైరెక్టర్స్‌ రాజ్‌ అండ్‌ డీకే నుంచి కొత్త సిరీస్‌ ప్రకటన | Raj And DK Announced New Web Series | Sakshi
Sakshi News home page

Rakt Bramhand: తెలుగు డైరెక్టర్స్‌ రాజ్‌ అండ్‌ డీకే నుంచి కొత్త సిరీస్‌ ప్రకటన

Published Sat, Jul 27 2024 4:17 PM | Last Updated on Sat, Jul 27 2024 7:42 PM

Raj And DK Announced New Web Series

రాజ్‌ నిడిమోరు, కృష్ణ దాసరి కొత్తపల్లి సినీరంగంలో రాజ్‌ అండ్‌ డీకేగా గుర్తింపు పొందారు. తాజాగా మరో వెబ్‌ సిరీస్‌ను ఈ డైరెక్టర్స్‌ ప్రకటించారు. బాలీవుడ్‌ ప్రేక్షకులకు ఇష్టమైన ఈ దర్శకులు మన తెలుగు వారే కావడం విశేషం.   ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాకు చెందిన వీళ్లిద్దరు డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించారు.  ఫ్యామిలీ మ్యాన్‌, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ వంటి పాపులర్‌ వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు. ఇప్పుడీ వారు కలిసి మొదటిసారి ఓ యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్  భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు.

రాజ్‌ అండ్‌ డీకే కాంబినేషన్‌లో కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేస్తూ తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఒక పోస్టర్ విడుదల చేసింది. 'రక్త్‌ బ్రహ్మాండ్‌' పేరుతో విడుదలైన ఈ టైటిల్‌కు 'ది బ్లడీ కింగ్‌డమ్‌' అనేది ఉపశీర్షిక కూడా ఉంది. రాజ్‌ డీకే నుంచి రానున్న మొదటి యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పోస్టర్‌లో ఒక కిరీటంతో పాటు దాని చుట్టూ రక్తం కారుతున్నట్లుగా ఉంది. దీనిని బట్టి చూస్తుంటే ఈ సిరీస్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనిల్‌ బర్వే కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు.

రాజ్‌ అండ్‌ డీకే ప్రాజెక్ట్‌లో సమంత నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనే ఆమె నటించే ఛాన్స్‌ ఉందని ప్రచారం జరుగుతుంది. త్వరలో ఈ టీమ్‌ విడుదల చేయనున్న నటీనటుల జాబితాలో సమంత పేరు ఉంటుందని అభిమానులు ఆసిస్తున్నారు. రాజ్‌-డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటడెల్‌ వెబ్‌ సిరీస్‌ తెలుగు వెర్షెన్‌ త్వరలోనే విడుదల కానుందని సమాచారం.  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement