
‘‘నా కుటుంబసభ్యులు కోటిమంది’’ అని తెగ సంబరపడిపోతున్నారు సమంత. దక్షిణాదిన టాప్ 5 హీరోయిన్ల జాబితాలో సమంత పేరు ఉంటుంది. ఇటు సోషల్ మీడియాలోనూ సమంతకు ఫాలోయర్స్ ఎక్కువే. అందుకు తాజా నిదర్శనం ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఫాలోయర్స్ సంఖ్య పది మిలియన్ల (కోటిమంది)కు చేరడమే. ‘‘నా ఫ్యామిలీ టెన్ మిలియన్స్‌కు చేరింది. ఈ సందర్భంగా నేను పది స్వచ్ఛంద సంస్థలకు సాయం చేయాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సమంత. ట్వీటర్‌లో సమంతకు 8 మిలియన్స్ ఫాలోయర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ‘జాను’ తర్వాత మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు సమంత. తమిళంలో మాత్రం ‘కాదువాక్కుల రెండు కాదల్’ అనే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment