Samantha Akkineni Instagram Remuneration Will Blow Your Mind - Sakshi
Sakshi News home page

Samantha: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సమంత సంపాదన తెలిస్తే షాకే

Published Thu, Aug 12 2021 8:06 PM | Last Updated on Fri, Aug 13 2021 2:39 PM

Samantha Akkineni Instagram Remuneration Will Blow Your Mind - Sakshi

హీరోయిన్‌ సమంత క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయ చేశావే' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సమంత దాదాపు పదేళ్ల పాటు స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా అదే క్రేజ్‌ను కొనసాగిస్తుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు వ్యాపారవేత్తగానూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఇక సోషల్‌ మీడియాలో సమంత యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు తనకి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఫాలోయింగ్‌ విషయంలోనూ సౌత్‌లో మిగతా హీరోయిన్ల కంటే సమంతదే పైచేయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం సమంతకు ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 18 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. దీంతో

దీంతో పలు కంపెనీలు సైతం తమ బ్రాండ్లకు ప్రచారం చేయాల్సిందిగా క్యూ కడుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే భారీ రెమ్యునరేషన్‌ అందుకుంటుందట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కి గాను సమంత దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తుందని టాక్‌ వినిపిస్తోంది. వీటితో పాటు పలు టీవీ యాడ్స్‌ నుంచి కూడా లక్షల్లో రెమ్యునరేషన్‌ అందుకుంటుందట. దీంతో సినిమాలకు ధీటుగా పాటు వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తూ షాక్‌ ఇస్తుంది అక్కినేని కోడలు. కాగా ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను  ‘దిల్‌’ రాజు, నీలిమా గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement