Thalapathy Vijay Makes Smashing Instagram Debut With 4.6 Millions Followers, Deets Inside - Sakshi
Sakshi News home page

Vijay: దళపతి విజయ్.. 24 గంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్!

Published Mon, Apr 3 2023 5:08 PM | Last Updated on Mon, Apr 3 2023 9:51 PM

Thalapathy Vijay Makes Smashing Instagram Debut 4.6 Millions Followers - Sakshi

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆయనకు భారీసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్న హీరో దళపతి విజయ్. ఇటీవలే వారసుడు(వారీసు) మూవీతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ప్రస్తుతం సెలబ్రిటీలు సోషల్ మీడియాను విరివిగా వాడేస్తున్నారు. తమ అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం సినీతారలు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఆయనకు ఇన్‌స్టాలో ఖాతా లేదంటే విచిత్రంగా ఉంది కదూ. అవునండీ తాజాగా దళపతి విజయ్ తన ఇన్‌స్టా ఖాతాను తెరిచారు. ఇంకేముంది ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు.

విజయ్ ఖాతా తెరిచిన 24 గంటల్లోనే ఏకంగా 4.6 మిలియన్ల ఫాలోవర్లు వచ్చేశారు. ఖాతా ప్రారంభించిన 99 నిమిషాల్లో 1 మిలియన్ల ఫాలోవర్స్ చేరిన తొలి ఇండియన్‌గా విజయ్ నిలిచారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ‍్యాప్తంగా చూస్తే ఈ విషయంలో విజయ్ మూడోస్థానం దక్కించుకున్నారు. తొలి రెండు స్థానాల్లో బీటీఎస్ వీ(43 నిమిషాలు), ఎంజెలీనా జోలీ(59 నిమిషాలు) ఉన్నారు. దీంతో నెటిజన్స్ దళపతి విజయ్ అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. అంతకుముందు కేవలం 15 గంటల్లో 3.9 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. 

విజయ్ ఇన్‌స్టాలో ఎంట్రీ ఇస్తూ ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాలో రాస్తూ.. 'హలో నంబా అండ్ నంబిస్' వెల్‌కమ్‌ సందేశం ఇచ్చారు. కాగా.. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న  ‘లియో’ షూటింగ్‌లో ఉన్నారు. గతంలో ట్విటర్‌ ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న విజయ్, కొంతకాలం విరామం తీసుకున్నాడు. దళపతికి ఇప్పటికే ఫేస్‌బుక్‌లో 7.8 మిలియన్లు, ట్విట్టర్‌లో 4.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement