రౌడీ రికార్డు.. సౌత్‌ నుంచి ఒకే ఒక్కడు | Vijay Deverakonda Set Record With One Crore Instagram Followers | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాలో విజయదేవరకొండ రికార్డు

Published Fri, Dec 25 2020 10:14 AM | Last Updated on Fri, Dec 25 2020 10:48 AM

Vijay Deverakonda Set Record With One Crore Instagram Followers - Sakshi

‘వాట్సప్‌.. వాట్సప్‌ మై రౌడీస్‌’ అని అభిమానులను ప్రేమగా అంటుంటాడు విజయ్‌ దేవరకొండ. అభిమానులకు కూడా విజయ్‌ అంటే బోలెడంత ప్రేమ. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి మంది ఫాలోవర్లను దక్కించుకోగలిగాడు విజయ్‌. ప్రస్తుతం 10 మిలియన్ల ఫాలోవర్స్‌ కలిగి రికార్డు సృష్టించాడు. దక్షిణాది స్టార్స్‌లో ఇన్‌స్టాలో కోటిమంది ఫాలోవర్లను సంపాదించుకున్న మొదటి హీరో విజయ్‌ కావడం విశేషం. ఈ క్రమంలో ‘వన్‌ క్రోర్‌ ఇన్‌స్టా రౌడీస్‌’ అనే ట్యాగ్‌తో సోషల్‌ మీడియా అంతా విజయ్‌ ఇన్‌స్టా రికార్డ్‌ హల్‌చల్‌ చేసింది. చదవండి: సైనికుడి పాత్రలో విజయ్‌ దేవరకొండ

కాగా ఈ రికార్డు సాధించిన నేపథ్యంలో విజయ్ ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నాడు.  పదిమందికి అయినా.. అంతే లవ్ అని 100 మందికి అయినా తాను చూపించే లవ్ అంతేనని.. తాజాగా కోటి మందికి అయినా ఆ ప్రేమ తగ్గదని కొంత భావోద్వేగంతో రాశాడు. దీంతో తన ఫాలోవర్స్ కూడా భావోద్వేగం అవుతూ.. లవ్ యూ విజయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అందుకే నువ్వంటే ఇష్టమని అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. వరల్డ్ ఫేమస్ లవర్ లాంటీ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో  ఫైటర్‌ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement