ఇన్‌స్టాలో భార్యకు విపరీతమైన ఫాలోవర్స్ .. అనుమానంతో భర్త కిరాతకం | UP: Jealous of WifeInstagram Following Man Strangles Her To Death | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాలో భార్యకు విపరీతమైన ఫాలోవర్స్ .. అనుమానంతో భర్త కిరాతకం

Published Mon, Aug 14 2023 9:27 PM | Last Updated on Mon, Aug 14 2023 9:30 PM

UP: Jealous of WifeInstagram Following Man Strangles Her To Death - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యకు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ చూసి అసూయ, అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా చంపాడు భర్త... కన్న పిల్లల ఎదుటే భార్య  గొంతు నులిమి హత్య చేశాడు.

వివరాలు.. లక్నోలోని పారా ప్రాంతంలో వ్యాపారవేత్తకు భార్య 12 ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అతడి భార్య గృహిణి.  ఆమెకు సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. అంతేగాక ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య  తనను బ్లాక్‌చేయడంతో భర్తకు కోపం వచ్చింది. తన భార్యకు ఎవరితోనో ఎఫైర్ ఉందని, తాను ఇంట్లో లేని సమయంలో తన భార్యను  సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ కలుస్తున్నారన్న అనుమానం ఏర్పడింది. ఈ విషయం భార్య, భర్తల మధ్య గొడవకు దారి తీసింది.

ఈ క్రమంలో ఆదివారం పిల్లలతో కలిసి కారులో రాయ్‌బరేలికి బయలుదేరారు. మధ్యలోనే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే వైపు కారును తిప్పాడు. నిందితుడు మధ్యలో సుల్తాన్‌పూర్‌లోని ముజేష్ కూడలి దగ్గర కారు ఆపాడు. అక్కడ తన భార్యతో సోషల్‌ మీడియా వ్యవహారంపై వాగ్వాదానికి దిగాడు.  దీంతో కోపంతో పిల్లల ముందే భార్యను గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అదే వాహనంలో లాక్‌ చేసుకుని ఉండిపోయాడు. ఊహించని ఘటనతో పిల్ల్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తల్లి మరణంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.

అయితే.. అనుమానాస్పదంగా కారు పార్కింగ్‌ చేయడంతో పెట్రోలింగ్‌ బృందం ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేసింది. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి తనిఖీలు చేపట్టగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తమ కళ్ల ముందే తల్లిని దారుణంగా చంపాడని కుమార్తె, కుమారుడు తెలిపారు. వారి వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement