
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు టాలీవుడ్‌లోనే కాకుండా మాలీవుడ్‌లో కూడా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆయన చేసిన అల వైకుంఠపురం ఘన విజయాన్ని సాధించి ఎన్నో రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతి తక్కువ కాలంలోనే 8 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సాధించిన ఘనత సాధించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన అభిమానులందరికి కృతజ్ఞతలు తెలిపారు. 8 మిలియన్స్ అనేది కేవలం ఫాలోవర్స్ కాదు, అది నెంబర్ , స్టాటిస్టిక్స్, పాపులారిటి కాదు అది అంతులేనంత అభిమానం, ఆశీర్వదం. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు. నేను శిరసు వంచి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని రాసి ఒక పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఇక అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం దర్శకుడు కొరటాల శివతో చేయనున్న విషయం తెలిసిందే.
చదవండి: నిహారిక నిశ్చితార్థం.. ‘భార్యంటే ఎంత ప్రేమో’
Comments
Please login to add a commentAdd a comment