తగ్గేదే లే | Allu Arjun's achievement of reaching 20 million followers on Instagram | Sakshi
Sakshi News home page

తగ్గేదే లే

Published Fri, Mar 3 2023 12:58 AM | Last Updated on Fri, Mar 3 2023 5:02 AM

Allu Arjun's achievement of reaching 20 million followers on Instagram - Sakshi

సోషల్‌ మీడియాలో ఫాలోయర్స్‌ విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నారు అల్లు అర్జున్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ ఫాలోయర్స్‌ జాబితా 20 మిలియన్స్‌ (2 కోట్లు)కు చేరింది. దక్షిణాదిన ఈ ఫీట్‌ను సాధించిన తొలి హీరో అల్లు అర్జున్‌ కావడం విశేషం. అయితే ‘పుష్ప’ తొలి భాగం రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోయర్లు ఉంటే ఆ సినిమా విడుదల తర్వాత వచ్చిన 20 మిలియన్స్‌కు చేరుకుందని అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’లో నటిస్తున్నారు అల్లు అర్జున్‌. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేసే ఆలోచనలో యూనిట్‌ ఉందని సమాచారం. సుకుమార్‌ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement