
ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త మైలురాయి చేరుకున్నారు అల్లు అర్జున్. ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫాలోయర్స్ సంఖ్య 8 మిలియన్లు దాటింది. అంటే సుమారు 80 లక్షల మంది ఆయన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. ‘‘8 మిల్లియన్లను నేను ఓ సంఖ్యలా చూడను. నాకున్న పాపులారిటియో, ఫాలోయింగో అని కూడా అనుకోను. నా మీద మీ అందరూ చూపిస్తున్న ప్రేమ, అభిమానం.. ముఖ్యంగా మీ దీవెన అని అనుకుంటాను. మీ అందరి ప్రేమకు వినమ్రంగా తలవంచుతున్నాను. ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు అల్లు అర్జున్.
Comments
Please login to add a commentAdd a comment