సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. మోదీ దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చురుకుగా ఉంటూ రాజకీయ, పాలనాపరమైన విషయాలను ప్రజలతో పంచుకుంటారు. తాజాగా ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో 60 మిలియన్ల (6కోట్లు) ఫాలోవర్స్ మైలు రాయిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ మూడో స్థానంలో నిలిచారు. 120 మిలియన్ ఫాలోవర్స్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో నిలవగా, 83 మిలియన్ ఫాలోవర్స్‌తో ప్రస్తుత యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో ఉన్నారు. (ఖాతాల హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వండి)
మోదీ 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ట్విటర్ ఖాతాను ప్రారంభిచారు. 2014లో మోదీ ప్రధాని పదవి చేపట్టడంతో ట్విటర్‌లో ఆయన పాపులారిటీ అధికమవటంతో పాటు ఫాలోవర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. ఇక భారతదేశంలో ఏ ఇతర రాజకీయ నాయుకుడికి లేని ఫాలోవర్స్‌ను మోదీ దక్కించుకున్నారు. దాంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా 37 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అద్భుతమైన ప్రసంగ నైపుణ్యం కలిగిన మోదీ తన ట్విటర్ ఖాతాలో చురుకుగా ఉంటూ.. క్రమం తప్పకుండా ఆయన చేసిన ప్రసంగాలు, సందర్శించిన ప్రదేశాలు, కలిసుకున్న జాతీయ, అంతర్జాతీయ వ్యక్తుల సమాచారాన్ని ట్విటర్‌లో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. (‘చైనా ట్విటర్’ అకౌంట్ మూసేసిన ప్రధాని )
సోషల్ మీడియాలో మోదీ హవా
Published Sun, Jul 19 2020 2:22 PM | Last Updated on Sun, Jul 19 2020 5:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment