అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పిన కోలీవుడ్‌ స్టార్‌ శింబు | Actor Simbu Hits One Million Followers On Instagram | Sakshi
Sakshi News home page

అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పిన కోలీవుడ్‌ స్టార్‌ శింబు

Published Thu, May 27 2021 8:55 PM | Last Updated on Thu, May 27 2021 8:55 PM

Actor Simbu Hits One Million Followers On Instagram - Sakshi

తమిళ సూపర్ స్టార్ శింబు ఇన్‌స్టాగ్రామ్‌లో 1మిలియన్‌ ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు. గతేడాది అక్టోబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన శింబు ఏడాది కూడా పూర్తి కాకుండానే 1మిలియన్‌ మార్కును చేరుకున్నాడు. ఈ సందర్భంగా తన ఫాలోవర్లకు, అభిమానులకు శింబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. గతేడాది చెన్నైలోని ఓ కాలేజీ ఈవెంట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ 1 మిలియన్‌ ఫాలోవర్స్‌కి థ్యాంక్స్‌ చెప్పాడు. ఇక లేట్‌గా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చినా..ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం   ‘మానాడు’ సినిమాలో శింబు నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక‌్షన్‌ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 

చదవండి :Rangam: జీవా ప్లేస్‌లో శింబు, ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement