Prabhas Reached 8 Million Followers in Instagram - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌ ఖాతాలో మరో మైల్‌స్టోన్‌.. 'రాధేశ్యామ్‌' రిలీజ్‌కు ముందే

Published Mon, Mar 7 2022 6:11 PM | Last Updated on Mon, Mar 7 2022 10:01 PM

Prabhas Reached 8 Million Followers In Instagram - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సుమారు రూ. 300కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్‌ ఓ రేంజ్‌లో కొనసాగుతున్నాయయి. ఇదిలా ఉండగా ప్రభాస్‌ తాజాగా మరో అరుదైన రికార్డును సాధించాడు.

ఇప్పటికే ప్రపంచమంతా క్రేజ్‌ ఉన్న ప్రభాస్‌ తాజాగా మరో మైల్‌స్టోన్‌కి రీచ్‌ అయ్యాడు. అతి తక్కువ కాలంలోనే ఆయన ఇన్‌స్టా ఫాలోవర్స్‌ సంఖ్య 8మిలియన్స్‌కి పైగా చేరుకుంది. అయితే సోషల్‌ మీడియాకు దూరంగానే ఉండే ప్రభాస్‌ కేవలం తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ని షేర్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్‌ ఫాలోవర్స్‌ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.  ‘స‌లార్', ‘ప్రాజెక్ట్‌-K’ఇప్పుడు షూటింగ్‌ దశలో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement