
టాలీవుడ్‌లో మిగతా హీరోలతో పోలిస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తాడు. ఎప్పుడో ఒక్కసారి, ముఖ్యమైన సమాచారం ఉంటే తప్ప సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడు. కానీ అతడిని ఫాలో అయ్యే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ టైగర్ తన ట్విటర్‌లో 5 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు. 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్ స్టార్స్‌లో ఒకరిగా తారక్ నిలిచాడు.
మే 28న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… ఒక్కరోజే ఈయనను దాదాపు 2 వేల మంది ఫాలో అవ్వడం గమనార్హం. ఇక తమ అభిమాన హీరో ట్విటర్‌లో 50 లక్షల మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో #5MFollowersForNTR అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.
చదవండి:
ఆ సినిమా కోసం రోజుకు 18 గంటలు కష్టపడ్డాం : రాశిఖన్నా
బాలయ్య నోట శ్రీరామ దండకం.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment