అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌లో బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు ఈ రౌడీ హీరో. సినిమాల్లో విజయ్ హీరోయిజానికి ఎంత మంది అభిమానులో.. బయట అతడి యాటిట్యూడ్, వ్యక్తిత్వానికి అంతే రేంజ్‌లో ఫాలోవర్లు కూడా ఉన్నారు. ‘వాట్సప్.. వాట్సప్ మై రౌడీస్’ అని అభిమానులను ప్రేమగా అంటుంటాడు విజయ్ దేవరకొండ. అభిమానులకు కూడా విజయ్ అంటే బోలెడంత ప్రేమ. అలా సోషల్ మీడియాలో రోజురోజుకూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్న విజయ్ ఇప్పుడు మరో రికార్డును సాధించాడు.
ఫేస్‌బుక్‌లో 10 మిలియన్ ఫాలోవర్ల అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తెలుగులో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో విజయ్ ఒకరు. ఇక ఇటీవలె విజయ్ వరుసగా ముచ్చటగా మూడో ఏడాది మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ ఎవరూ సాధించని ఈ ఫీట్‌తో విజయ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్‌తో పాన్ ఇండియా మూవీ ‘లైగర్' చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment