న్యూఢిల్లీ: క్రికెట్‌లో రికార్డుల రారాజుగా చలామణి అవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. అయితే, ఈ సారి కింగ్ కోహ్లి రికార్డును క్రియేట్ చేసింది క్రికెట్‌లో మాత్రం కాదు. కోహ్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో 150 మిలియన్ల (15 కోట్లు) ఫాలోవర్ల రేర్ ల్యాండ్ మార్క్‌ను క్రాస్ చేసి సోషల్‌మీడియా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుల్లో నిలిచాడు. భారత్‌లోనే కాక ఆసియా ఖండం మొత్తంలో ఈ ఫీట్ అందుకున్న తొలి వ్యక్తి కోహ్లినే కావడం మరో విశేషం.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇన్‌స్టాలో అత్యంత ప్రజాదరణ(ఫాలోవర్స్) కలిగిన క్రీడాకారుల్లో కింగ్ కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. 337 మిలియన్ల ఫాలోవర్లతో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. మెస్సీ (260 మిలియన్లు), నెయ్‌మార్ (160 మిలియన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, టీమిండియా కెప్టెన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్ (43.4 మిలియన్లు), ఫేస్‌బుక్ (48 మిలియన్లు)లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి ఒక స్పాన్సర్ పోస్టు ద్వారా ఏకంగా రూ. 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
చదవండి: "కోచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు".. భారత స్టార్ ప్లేయర్ సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment