సెలబ్రిట్వీట్స్‌ | twitter birthday in this month | Sakshi
Sakshi News home page

సెలబ్రిట్వీట్స్‌

Published Mon, Mar 6 2017 12:02 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

సెలబ్రిట్వీట్స్‌ - Sakshi

సెలబ్రిట్వీట్స్‌

ఈ నెలలో ట్విట్టర్‌ బర్త్‌ డే
ట్రంప్‌.. ట్విట్టర్‌ ప్రియుడు. మాట్లాడితే ట్విట్టర్‌లోకి వెళ్లి ఏదో ఒకటి ట్వీట్‌ చేస్తుంటారు. మనసులో ఏం ఉంచుకోరు! ఈ లెక్కన ట్విట్టర్‌లో ‘మోస్ట్‌ పాపులర్‌ లీడర్‌’ ట్రంపే అవ్వాలి కదా. కానీ కాదు! పూరి జగన్నాథ్‌ సినిమాల భాషలో చెప్పాలంటే.. ‘ఎన్ని ట్వీట్‌లు పెట్టారని కాదన్నయ్యా.. ఆ ట్వీట్‌లకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారన్నదే’ పాయింట్‌. ఆ లెక్కన ట్రంప్‌ కన్నా పాపులర్‌ లీడర్లు ఉన్నారు.

ఈ నెలలో ట్విట్టర్‌ బర్త్‌ డే ఉంది. అంటే ఫౌండేషన్‌ డే. (లాంచ్‌ డే వేరే). ఈ సందర్భంగా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్న దేశాధినేతలు, ట్విట్టర్‌లో వాళ్లెప్పుడు చేరారు? వాళ్లకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు? వాళ్లు పెట్టిన ఓ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌.. మీ కోసం.

బరాక్‌ ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు
ఫాలోవర్స్‌: 8 కోట్ల 51 లక్షలు.
చేరింది: 2007 మార్చి
విక్టరీ ట్వీట్‌: This happend because of you.
(నీ వల్లే.. నీ వల్లే..)    ఆ ట్వీట్‌కి ఒబామా పెట్టిన ఫొటో ఇదే.

నరేంద్ర మోదీ
భారత ప్రధాని
ఫాలోవర్స్‌ : 2 కోట్ల 74 లక్షలు.
చేరింది : 2009 జనవరి
విక్టరీ ట్వీట్‌ :  India has won! (భారత్‌ గెలిచింది!)

డొనాల్డ్‌ ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు

ఫాలోవర్స్‌: 2 కోట్ల 57 లక్షలు
చేరింది: 2009 మార్చి
విక్టరీ ట్వీట్‌: such a beautiful and important evening! The forgotten men and women will never be forgotten again. We will all come together as never before.  (ఎంత అందమైన, ప్రాముఖ్యమైన సాయంత్రం. నిరాదరణకు గురైనవారు మళ్లీ ఇక నిరాదరణకు గురికాకూడదు. మునుపెన్నడూ లేనంతగా మనం ఏకం అవుదాం.)

హిల్లరీ క్లింటన్‌
అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి
ఫాలోవర్స్‌: కోటీ 34 లక్షలు
చేరింది: 2013 ఏప్రిల్‌
ఫేమస్‌ ట్వీట్‌: A man who can be provoked by a tweet should not have his hands anywhere near the nuclear codes. (ఒక్క ట్వీట్‌తో రెచ్చిపోయే మనిషికి అణ్వాయుధాలు అందుబాటులో ఉండకూడదు.)

పోప్‌ ఫ్రాన్సిస్‌
రోమన్‌ క్యాథలిక్‌ చర్చి పోప్‌
ఫాలోవర్స్‌ : కోటీ 4 లక్షలు
చేరింది : 2012 ఫిబ్రవరి
ఫేమస్‌ ట్వీట్‌ : I cannot imagine a Christian who does not know how to smile. May we joyfully witness to our faith.
(నవ్వడం ఎలాగో తెలియని క్రైస్తవుడిని నేను ఊహించలేకపోతున్నాను. మన విశ్వాసానికి ఉల్లాసం సాక్ష్యమవ్వాలి.)

రెజీప్‌ తయ్యీప్‌ ఎర్డోగాన్‌
టర్కీ అధ్యక్షుడు
ఫాలోవర్స్‌ : 90 లక్షల 90 వేలు
చేరింది : 2009 ఆగస్టు
ఫేమస్‌ ట్వీట్‌ : I don't like to tweet. It is a knife in the hand of a murderer. (ట్వీట్‌ చెయ్యడం నాకు ఇష్టం లేదు. అది హంతకుడి చేతిలో కత్తి లాంటిది.)

షేక్‌ మహమ్మద్‌ బిన్‌
రషీద్‌ అల్‌ మక్చూమ్‌ యు.ఎ.ఇ. ప్రధాని, ఉపాధ్యక్షుడు
ఫాలోవర్స్‌: 70 లక్షల 50 వేలు
చేరింది: 2009 జూన్‌
జెండర్‌ ట్వీట్‌: I salute all woman on International Women's Day. Every role a woman takes is sacred and deserves our appreciation and respect. (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ సెల్యూట్‌ చేస్తున్నాను. స్త్రీ నిర్వహించే ప్రతి బాధ్యతా పవిత్రమైనది; గుర్తింపును, గౌరవాన్ని పొందదగినదీ.)

సుష్మా స్వరాజ్‌
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
ఫాలోవర్స్‌: 70 లక్షల 30 వేలు
చేరింది: 2010 నవంబర్‌
విక్టరీ ట్వీట్‌: I was sworn as youngest ever Cabinet Minister in the country in 1977... 39 years back. (39 ఏళ్ల క్రితమే 1977లో అతి చిన్న వయసు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను.)

జోకో విడూడూ
ఇండోనేషియా అధ్యక్షుడు

ఫాలోవర్స్‌: 70 లక్షలు
చేరింది : 2011 సెప్టెంబర్‌
ఫేమస్‌ ట్వీట్‌: I don't mind being called a puppet. But I'm the puppet of the people. (నన్ను కీలుబొమ్మ అన్నా నేనేం పట్టించుకోను. నేను కీలుబొమ్మనే.. ప్రజల చేతుల్లో.)

ఎరిక్‌ పెనా నియతో
మిక్సికో అధ్యక్షుడు

ఫాలోవర్స్‌: 60 లక్షల 20 వేలు
చేరింది: 2007 మార్చి
ఫేమస్‌ ట్వీట్‌ : I repeat what I told him in person: Mr.Trump, Mexico will never pay for the wall.
(ఆయనకు ముఖాముఖి నేనేం చెప్పానో మళ్లీ చెప్తాను. ‘మిస్టర్‌ ట్రంప్, గోడ కట్టడానికి అయ్యే ఖర్చును మేము చెల్లించం’.

క్రిస్టీనా ఫెర్నాండెజ్‌ డి కిష్నర్‌
అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు

ఫాలోవర్స్‌: 40 లక్షల 80 వేలు
చేరింది: 2010 ఏప్రిల్‌
బ్యాడ్‌ ట్వీట్‌: More than 1,000 participants at the event.. Are they all from the Campola and in it only for the lice and petloeum?  (వెయ్యిమందికి పైగా ఈవెంట్‌కి వచ్చారు. వారంతో కంపోలా నుంచి, అది కూడా, లైస్‌ కోసం, పెట్రోలియం కోసం వచ్చారా?) క్రిస్టీనా.. చైనాలో పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి వారికి ఇంగ్లిష్‌ లెటర్‌ ‘ఆర్‌’ పలకడం రాదని.. కంపోరాను, కాంపోలా అనీ, రైస్‌ని లైస్‌ అనీ, పెట్రోలియంని పెట్లోలియం అనీ పలుకుతారనీ చేసిన ఈ ట్వీట్‌ ఆమె ఇమేజ్‌కు తగిన విధంగా లేదని విమర్శలు వచ్చాయి.

జువాన్‌ మాన్యుయేల్‌ శాంటోస్‌
కొలంబియా అధ్యక్షుడు

ఫాలోవర్స్‌: 40 లక్షల 80 వేలు
చేరింది: 2009 ఆగస్టు
ఇన్‌స్పైరింగ్‌ ట్వీట్‌:I congratulate Gabriela for getting 5 on her home work! So Colombia with better education. Our Gabriela and the country does not stop.  (హోమ్‌వర్క్‌లో 5 మార్కులు సాధించిన గాబ్రియేలాకు అభినందనలు. కొలంబియా కూడా చదువులో ఇలాగే మెరుగవ్వాలి. గాబ్రియేలా, కొలంబియా ముందుకు సాగాలి.)

మెట్టెయో రెంజీ
ఇటలీ మాజీ ప్రధాని

ఫాలోవర్స్‌: 20 లక్షల 90 వేలు
చేరింది: 2009 జనవరి
అందమైన ట్వీట్‌: Birthday special for a woman who the Italy loves. Happy birthday to Sophia Loren, four times twenty years old.  (ఇటలీ ఎంతగానో ప్రేమించే స్త్రీకి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు ‘ఇరవై ఏళ్ల’ సోఫియా లోరెన్‌కు హ్యాపీ బర్త్‌డే.)

జస్టిన్‌ ట్రూడో
కెనడా ప్రధాని

ఫాలోయర్స్‌: 20 లక్షల 90 వేలు
చేరింది: 2008 మార్చి
పొలిటికల్‌ ట్వీట్‌ : Last week I challenged leaders in politics and business to do more for the middle class and help build a better world together.   (మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి, మెరుగైన ప్రపంచ నిర్మాణానికి మనమంతా కలసికట్టుగా ఇంకా ఏదైనా చెయ్యాలని గతవారం నేను రాజకీయ, వ్యాపార రంగాలలోని నాయకులకు పిలుపునిచ్చాను.)

డేవిడ్‌ కామెరాన్‌
యు.కె. మాజీ ప్రధాని

ఫాలోవర్లు: 10 లక్షల 60 వేలు
చేరింది: 2008 మార్చి
ట్వీట్‌ : My best wishes to British Sikhs celebration the birth of Guru Nanak Dev. You help make Britain a brighter, better and more successful nation.  (గురునానక్‌ జయంతిని జరుపుకుంటున్న బ్రిటన్‌లోని సిక్కులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రిటన్‌ ఒక ఉజ్వలమైన, మెరుగైన, విజయవంతమైన దేశంగా ఎదగడంలో మీ తోడ్పాటు ఉంది.)

నికోలాస్‌ సర్కోజీ
ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు
ఫాలోవర్స్‌: 10 లక్షల 50 వేలు
చేరింది: 2012 ఫిబ్రవరి
బెస్ట్‌ ట్వీట్‌: New life, new challenges! You're going to love it! I wish you the best, Dear.
(కొత్త జీవితం, కొత్త సవాళ్లు! వాటిని ప్రేమగా స్వీకరించబోతున్నావు. శుభాకాంక్షలు ప్రియతమా.) ఒబామాను ఉద్దేశించి.

దిమిత్రీ మెద్వెదెవ్‌
రష్యా ప్రధాని
ఫాలోవర్స్‌: 10 లక్షల 10 వేలు.
చేరింది: 2010 జూన్‌
ట్వీట్‌: silicon Valley's greatest asset is communication. People discuss their work not trifles. Russia would benefit from this kind of environment.  (సిలికాన్‌ వ్యాలీకి ఉన్న గొప్ప సంపద.. సమాచార వ్యవస్థ. అక్కడివారు పని గురించి మాట్లాడతారు తప్ప, నిష్ప్రయోజనకరమైన విషయాలను చర్చించరు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement