సాక్షి, న్యూఢిల్లీ : టిక్‌టాక్ నిషేధం అనంతరం టిక్‌టాక్ స్టార్లు ఫ్రస్ట్రేషన్ లో మునిగిపోయారు. ఈ నిషేధం సోమవారం నుంచి అమల్లోకి వచ్చినప్పటి నుండి, ప్రత్యామ్నాయాలపై వైపు దృష్టిపెట్టారు. ముఖ్యంగా తమ అనుచరులను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఫాలో కావాలని కోరడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోలతో ఇన్‌స్టాలో హల్ చల్ చేస్తున్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ కు క్రేజ్ క్రమంగా పుంజుకోనుంది. (నిషేధంపై టిక్‌టాక్ స్పందన)
టిక్‌టాక్ ప్రొఫైల్‌లలో వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలను అందిస్తున్నారు. ఇన్‌స్టా ఎలా ఉపయోగించాలో అభిమానులకు నేర్పుతూ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇంకా చాలామంది టిక్‌టాక్ వినియోగదారులు ఇన్‌స్టా లైవ్ ద్వారా తమని ఫాలో కావాలని, యూట్యూబ్‌లో తమ వీడియోలను చూడమని కోరుతుండటం విశేషం. అయితే టిక్‌టాక్ యాప్ ను ఆపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతం డౌన్‌లోడ్ చేయలేం. కానీ ఇప్పటికే టిక్ టాక్ యాప్ ఫోన్‌లలో ఉన్న యూజర్లకు దీనికి యాక్సెస్ ఉంది. మరోవైపు టిక్‌టాక్ నిషేధంపై సోషల్ మీడియాలో ఆర్ఐపీ టిక్‌టాక్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో వుంది. యూజర్లు మీమ్స్, వీడియోలతో సందడి చేస్తున్నారు. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు)
Twitter celebs jinka khud ka account tiktok videos ke bharose chal raha tha: pic.twitter.com/SZuK0woQm0
— Diksha🌈 (@BrahmaandKiMaa) June 29, 2020
Right now in Bharat#TikTok stars vs non TikTok users pic.twitter.com/GIT25do5sK
— Vertigo_Warrior (@VertigoWarrior) June 29, 2020
Twitter celebs jinka khud ka account tiktok videos ke bharose chal raha tha: pic.twitter.com/SZuK0woQm0
— Diksha🌈 (@BrahmaandKiMaa) June 29, 2020
#TikTok worker right now thinking about #tiktokbanindia .
— PREM (@PREM48722990) June 30, 2020
#RIPTiktok pic.twitter.com/smblKUsZv4
Comments
Please login to add a commentAdd a comment