
సాక్షి, యాదాద్రి/వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఖ్య అనుచరుడు పాశం శ్రీనివాస్‌కు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు ఏఎస్‌ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం సస్పెండ్ చేశారు. నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత అతడికి సహకరించిన పాశం శ్రీనివాస్‌పై పీడీ యాక్టు పెట్టి వరంగల్ సెంట్రల్ జైలుకు గత ఏడాది జూలైలో తరలించారు. 2016 జూలై 15న పీడీ యాక్టు నమోదు కాగా.. 2017 జూలై 14తో ముగిసి పోయింది.
తాజాగా పోలీసుల ఫోన్‌తో జైలులో ఉన్న శ్రీనివాస్ తనను బెదిరించినట్లు బాధితులు రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్కార్ట్ పోలీసులు రమేష్, పాషా, రమేష్, లక్ష్మీనారాయణల సెల్‌ఫోన్లతో శ్రీనివాస్ కాల్స్ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో వీరిపై కమిషనర్ సస్పెండ్ చేశారు. కాగా పాశం శ్రీనివాస్‌కు సహకరిస్తున్న అతని అనుచరులైన అందె సాయి కృష్ణ, అంగడి నాగరాజు, మెరుగు శివశంకర్, పులి శ్రీనివాస్, పాశం అమర్‌నా«థ్‌లపై కేసులు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇదిలాఉండగా.. పాశంను వరంగల్ సెంట్రల్ జైలులోని హైసెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచినందున సెల్‌ఫోన్‌లు వినియోగించే అవకాశం లేదని జైలు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment