ప్రభాస్
‘బాహుబలి’తో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఫ్యాన్స్‌ను ‘డార్లింగ్స్’ అంటూ పిలిచే ప్రభాస్‌ను సోషల్ మీడియాలో చాలామంది ఫాలో అవుతుంటారు. తాజాగా ప్రభాస్ ముఖపుస్తకం (ఫేస్‌బుక్) ఫ్యామిలీ 16 (కోటీ అరవై లక్షలు) మిలియన్స్‌కు చేరుకుంది. ఫేస్‌బుక్‌లో 16 మిలియన్ ఫాలోయర్స్‌ను సంపాదించుకున్న తెలుగు హీరోలలో ముందు వరుసలో ఉన్నారు ప్రభాస్. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌కు ఇప్పటివరకు 4.8 మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే... ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తారు ప్రభాస్. అలాగే బాలీవుడ్‌లో ప్రభాస్ ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment