యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌పై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈనెల ఆరో తేదీన తిరుపతిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదంటూ ప్రచారం జరుగుతోంది.
(ఇది చదవండి: ప్రముఖ నటుడి కుమార్తెపై ట్రోలింగ్.. గట్టిగానే ఇచ్చి పడేసింది!)
దీంతో నెట్టింట వైరలవుతున్న ఈ వివాదంపై ఆదిపురుష్ చిత్రయూనిట్ స్పందించింది. ఆదిపురుష్ చిత్రంపై దుష్ప్రచారం జరుగుతోందని ప్రకటించింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తమని మేకర్స్ ప్రకటించారు. ఇలాంటి ప్రచారాలు సినిమాను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నాయని వెల్లడించారు. ఏ కుల, మత, వర్ణ వివక్షతకు తావులేకుండా సమానత్వం కోసం ఆదిపురుష్ బృందం శ్రమించిందని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని అడ్డుకుని ఆదిపురుష్‌కు సహకరించాలని చిత్రబృందం విజ్ఞప్తి చేసింది. ఈ సినిమా ప్రతీ భారతీయుడిదని చిత్రబృందం ప్రకటించింది.
(ఇది చదవండి: వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్.. ఫోటోలు వైరల్!)
Comments
Please login to add a commentAdd a comment