ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాపారపరంగా ఎంత బిజీగా ఉన్నా ట్విటర్‌లో మాత్రం యాక్టీవ్‌గా ఉంటారు. మస్క్ చమత్కార ట్వీట్‌లతో తన మిలియన్ల ఫాలోవర్లకు ఫన్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఈ సారి ఫన్‌తో పాటు షాక్ కూడా అందించాడు ఈ బిలియనీర్. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోని రెండు ట్వీట్లు చేసి అటు క్రీడా, ఇటు వ్యాపారం రంగంలో ఉన్న ప్రముఖులను షాక్‌కు గురిచేశాడు. ఇక నెటిజన్లు ఎలా స్పందించాలో తెలియక నోరెళ్లబెట్టి కూర్చున్నారు.
అంతా తూచ్..
ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ టీం మాంచెస్టర్ యూనైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ బుధవారం ట్వీట చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో పాటు దీనిపై చర్చలు ఊపందుకున్నాయి. అయితే ఈ తరుణంలో అందరికీ షాకిస్తూ తన తొలి ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మళ్లీ మస్క్ సీన్‌లోకి వచ్చాడు. ఓ ట్విటర్ యూజర్.. ‘ఇది నిజమా..?’ అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘లేదు. ట్విటర్‌లో ఈ జోక్ చాలాకాలంగా ప్రాచుర్యంలో ఉంది. నేను ఏ స్పోర్ట్స్ టీమ్‌ను కొనడం లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు మస్క్. దీంతో నెటిజన్లు కొందరు షాకైనట్లు కామెంట్లు పెట్టగా, మరికొందరు ఇలాంటి జోక్‌లు అవసరమా అంటూ మండిపడుతున్నారు.
ఏంటి ట్వీట్ల రచ్చ
ట్వీట్‌లతో ఎప్పుడు వార్తల్లో ఉండే ఎలాన్ మస్క్ ట్విటర్ ఈ సారి ఏకంగా రెండు ట్వీట్‌లతో కాసేపు బిజినెస్ వరల్డ్‌లో ప్రకంపనలు పుట్టించాడు. మొదటి ట్వీట్‌లో.. ‘నేను మీకు ఒక విషయం స్పష్టం చెప్పాలనుకుంటున్నాను. రిపబ్లికన్ పార్టీతో పాటు డెమొక్రాట్ పార్టీలకు నేను మద్దతునిస్తున్నా..’ అని తెలిపాడు. కాసేపు తర్వాత.. ‘ నేను మాంచెస్టర్ యూనైటెడ్ జట్టును కొనబోతున్నాను..’ అని అందరికి షాకిచ్చాడు. అయితే కొన్ని గంటల్లోనే జట్టును కొనుగోలుచేయడం జోక్‌గా తేల్చేశాడు.
To be clear, I support the left half of the Republican Party and the right half of the Democratic Party!
— Elon Musk (@elonmusk) August 16, 2022
Also, I’m buying Manchester United ur welcome
— Elon Musk (@elonmusk) August 17, 2022
No, this is a long-running joke on Twitter. I’m not buying any sports teams.
— Elon Musk (@elonmusk) August 17, 2022
చదవండి: BMW Motorrad 2022: బీఎండబ్ల్యూ కొత్త బైక్స్, ధర తెలిస్తే షాక్!
Comments
Please login to add a commentAdd a comment