అడల్ట్‌ సినిమాలో సాయి పల్లవి? | Sai Pallavi in Mysskin Adult Movie | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 20 2018 8:23 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

Sai Pallavi in Mysskin Adult Movie - Sakshi

సాక్షి, సినిమా : మళయాళంలో ఒక్క సినిమా(ప్రేమమ్‌)తో సెన్సేషన్‌గా మారిపోయిన సాయి పల్లవి.. తెలుగులోనూ ఫిదాతో అదే స్థాయి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తర్వాత ఎంసీఏతో కూడా ఫర్వాలేదనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతిలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 

బైలింగువల్‌ కణం(కరు) రిలీజ్‌కు రెడీగా ఉండగా.. తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా, తమిళ్‌లో సూర్య ఎన్‌జీకే, ధనుష్‌ మారి-2 సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటోంది. ఇవిగాక ఇప్పుడు కొత్తగా ఆమె చేతికి ఓ ప్రాజెక్టు వెళ్లినట్లు తెలుస్తోంది. విలక్షణ చిత్రాలను అందించే కోలీవుడ్‌ దర్శకుడు మిస్కీన్‌ త్వరలో ఓ రొమాంటిక్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించబోతున్నాడు. దర్శక నటుడు భాగ్యరాజ్‌ తనయుడు శాంతను హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. 

ఇందులో నిత్యా మీనన్‌తోపాటు సాయి పల్లవి కూడా నటించబోతోందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. నిత్యా ఇప్పటికే ఒకే చెప్పిందని.. పల్లవితో ఇంకా చర్చలు సాగుతున్నాయన్నది దాని సారాంశం. అయితే ఈ చిత్రంలో హర్రర్‌తోపాటు బోల్డ్‌ సన్నివేశాలు ఓ రేంజ్‌లోనే ఉంటాయని దర్శకుడు మిస్కీన్‌ మొన్నీమధ్యే మీడియాకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో హోమ్లీ గర్ల్‌ ఇమేజ్‌ ఉన్న సాయి పల్లవి ఈ సినిమాకు ఓకే చెబుతుందా? అన్నది కాస్త అనుమానంగానే మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement