Bollywood Actress Avneet Kaur Special Story And Interesting Facts In Telugu - Sakshi
Sakshi News home page

Avneet Kaur: 8 ఏళ్లకే ఇండస్ట్రీలో ఎంట్రీ.. హీరోయిన్‌గా మారిన డ్యాన్సర్‌

Published Sun, Aug 6 2023 10:02 AM | Last Updated on Sun, Aug 6 2023 11:24 AM

Know About Bollywood Actress Avneet Kaur - Sakshi

'డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌లో డ్యాన్సర్‌గా అలరించిన చిన్నారి ఇప్పుడేకంగా సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. తన ఎనిమిదో ఏట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. నేడు వరుస సినిమాలు, సీరియల్స్, సిరీస్‌లతో దూసుకుపోతున్న నటి అవనీత్‌ కౌర్‌ గురించి కొన్ని విషయాలు..

అవనీత్‌ కౌర్‌ జన్మస్థలం పంజాబ్‌. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. అలా ఎనిమిదేళ్ల వయసు నుంచే పలు స్టేజ్‌ షోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘డాన్స్‌ ఇండియా డాన్స్‌ లిటిల్‌ మాస్టర్‌’, ‘డాన్స్‌ కీ సూపర్‌ స్టార్స్‌’, ‘ఝలక్‌ దిఖ్‌లా జా 5’ తదితర డ్యాన్స్‌ షోలో పాల్గొని సెమీ ఫైనల్స్‌ వరకు వెళ్లింది.

పలు బాలీవుడ్, పంజాబీ మ్యూజిక్‌ వీడియోల్లోనూ ఆడిపాడింది. ఒకవైపు డ్యాన్స్‌ షోల్లో పొల్గొంటూనే.. టీవీ సీరియల్స్‌లోనూ నటించేది. అలా ‘మేరీ మా’, ‘సావిత్రి ఏక్‌ ప్రేమ్‌ కహానీ’, ‘హమారీ సిస్టర్‌ దీదీ’ వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. ‘అలాద్దీన్‌’ సీరియల్‌లో హీరోయిన్‌ యాస్మిన్‌ పాత్రతో అవనీత్‌ పాపులర్‌ అయింది. ఆ పాపులారిటీయే అవనీత్‌కి సినిమా అవకాశాన్నిచ్చింది. తొలిసారి వెండితెర మీద.. ‘మర్దానీ’లో మీరా పాత్రలో కనిపించింది.

ఆ తర్వాత ‘దోస్త్‌’, ‘బ్రూనీ’, ‘ఏక్తా’, ‘మర్దానీ 2’ సినిమాల్లో నటించింది. వెబ్‌తెరపై ‘బాబర్‌ కా తాబర్‌’, ‘బందిశ్‌ బండిట్స్‌’ వెబ్‌ సిరీస్‌లతో వీక్షకులనూ పలకరించింది అవనీత్‌. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతోన్న ‘టీకూ వెడ్స్‌ శేరూ’ సినిమాతో అలరిస్తోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ నిర్మించారు.

ముంబైకి వచ్చినప్పుడు నాకసలు ఇంగ్లిష్‌ రాదు. ఇండస్ట్రీనే నాకు మరాఠీతో పాటు హిందీ, ఇంగ్లిష్‌ భాషలనూ నేర్పింది.
– అవనీత్‌ కౌర్‌

చదవండి: రష్మిక లక్‌ మామూలుగా లేదుగా.. క్రేజీ ప్రాజెక్టులో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement