
'ఆశలపల్లకి'లో బాలనటుడిగా నటించిన సన్నీ పస్తా హీరోగా పరిచయమవుతున్న సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రం ద్వారా కార్తీక్ పంపాల దర్శకునిగా పరిచయమవుతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్, బెక్కెం సబిత నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు.
డైరెక్టర్ బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. లక్కీ మీడియా బ్యానర్ స్థాపించి 16 ఏళ్లు అయిన సందర్భంగా మా బేనర్‌లో 13వ సినిమా ప్రారంభించాం. మంచి ప్రేమకథగా అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉంటుంది అన్నారు. లక్కీమీడియా ద్వారా హీరోగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు సన్నీపిస్తా. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు కార్తీక్ పంపాల. ఈ చిత్రానికి కెమెరా: మితేష్.పి, సహ నిర్మాత: నాగార్జున వడ్డే(అర్జున్).
చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్
ఆ పాట సూడు, ఆ ఆట సూడు.. నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ చూడు..
Comments
Please login to add a commentAdd a comment