Pawan Kalyan Bangaram Movie Child Artist Sanusha Latest Look Goes Viral - Sakshi
Sakshi News home page

Pawan Kalyan: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?

Published Wed, May 17 2023 11:30 AM | Last Updated on Wed, May 17 2023 12:17 PM

Pawan Kalyan Bangaram Movie Child Actress Latest Look Goes Viral - Sakshi

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా గుర్తుందా? 2006లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన చిన్నారి ఇప్పటికీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంతకీ ఆ చిన్నారి ఇప్పుడేం చేస్తోంది? ఎలా ఉందో తెలుసా? ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

(ఇది చదవండి: అగ్రహీరోల సినిమాలు.. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఉండేలా ప్లాన్!)

బంగారం మూవీలో వింధ్య రెడ్డి పాత్రలో కనిపించిన ఈ చిన్నారి అసలు పేరు శనూష. మలయాళంలో బాలనటిగా రెండు రాష్ట్ర స్థాయి సినీ అవార్డులను గెలుచుకుంది. అంతేకాదు మలయాళంలో పలు సినిమాల్లో నటించిన చిన్నారి. బంగారం సినిమాతోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.  బంగారం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా శనూష ఎంట్రీ ఇవ్వగా అప్పుడు ఆమె వయస్సు కేవలం 10 సంవత్సరాలే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌ను ఆటపట్టిస్తూ అందరిని ఆకట్టుకుంది. 

ఇక ఆమె కెరీర్‌ విషయాకొనిస్తే.. మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా బంగారం సినిమాతో ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత ఐదేళ్లకు జీనియస్ అనే సినిమాతో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా తమిళ్ రీమేక్ చిత్రం రేణిగుంటలో కీలకపాత్రలో పోషించింది. 2019లో నాని హీరోగా వచ్చిన చిత్రం జెర్సీలో జర్నలిస్టు పాత్ర చేసింది. ఆమె పాత్ర చిన్నదే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. శనూష ప్రస్తుతం మళయాళంలో వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది.

(ఇది చదవండి: ఫస్ట్‌ డేట్‌లోనే శృంగారానికి ఓకే: స్టార్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement