Sanusha
-
'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా గుర్తుందా? 2006లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన చిన్నారి ఇప్పటికీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంతకీ ఆ చిన్నారి ఇప్పుడేం చేస్తోంది? ఎలా ఉందో తెలుసా? ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం. (ఇది చదవండి: అగ్రహీరోల సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా ప్లాన్!) బంగారం మూవీలో వింధ్య రెడ్డి పాత్రలో కనిపించిన ఈ చిన్నారి అసలు పేరు శనూష. మలయాళంలో బాలనటిగా రెండు రాష్ట్ర స్థాయి సినీ అవార్డులను గెలుచుకుంది. అంతేకాదు మలయాళంలో పలు సినిమాల్లో నటించిన చిన్నారి. బంగారం సినిమాతోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. బంగారం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా శనూష ఎంట్రీ ఇవ్వగా అప్పుడు ఆమె వయస్సు కేవలం 10 సంవత్సరాలే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌ను ఆటపట్టిస్తూ అందరిని ఆకట్టుకుంది. ఇక ఆమె కెరీర్ విషయాకొనిస్తే.. మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా బంగారం సినిమాతో ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత ఐదేళ్లకు జీనియస్ అనే సినిమాతో హీరోయిన్గా అడుగు పెట్టింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా తమిళ్ రీమేక్ చిత్రం రేణిగుంటలో కీలకపాత్రలో పోషించింది. 2019లో నాని హీరోగా వచ్చిన చిత్రం జెర్సీలో జర్నలిస్టు పాత్ర చేసింది. ఆమె పాత్ర చిన్నదే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. శనూష ప్రస్తుతం మళయాళంలో వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. (ఇది చదవండి: ఫస్ట్ డేట్లోనే శృంగారానికి ఓకే: స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by Sanusha Santhosh💫 (@sanusha_sanuuu) -
బంగారం మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
-
బంగారం మూవీలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
Bangaram Movie Child Artist, Sanusha Santhosh Present Photos Goes Viral: పవన్ కల్యాణ్, మీరాచోప్రా జంటగా నటించిన ‘బంగారం’సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా నటించిన అమ్మాయి గుర్తుందా? వింధ్య రెడ్డి పాత్రలో నటించి మెప్పించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సనూషా సంతోష్. బంగారం సినిమాతో బాలనటిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అయితే అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో 20కి పైగా సినిమాల్లో నటించింది. అలా ఉత్తమ బాలనటిగా చిన్న వయసులోనే రెండు సార్లు జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. 2012లో మిస్టర్ మురుగన్ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన సనూషా..ఆ తర్వాత రేణిగుంట, జీనియస్ వంటి చిత్రాల్లోనూ నటించింది. చివరగా నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో జర్నలిస్ట్ రమ్య పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా మళ్లీ మాలీవుడ్‌లోనే స్థిరపడిపోయింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని షేర్ చేస్తుంటుంది. అయితే ఈ అమ్మడి శరీరాకృతిపై కొందరు నెటిజన్లు బాడీ షేమింగ్ చేసినా ధీటుగా జవాబిస్తుంది.ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సానుష..లాక్డౌన్ సమయంలో ఎంతో నిరాశ, ఒంటరితనాన్ని ఫీలయ్యానని, ఆ సమయంలో ఎవరికి తెలియకుండా ఓ మానసిక వైద్యుడిని కూడా సంప్రదించినట్లు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించినట్లు తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాడీషేమింగ్: నెటిజన్లపై ‘జెర్సీ’ నటి ఫైర్
బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం నటిగా గుర్తింపు పొందింది మలయాళి భామ సనూష. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బంగారం’ మూవీతో తెలుగు తెరకు పరిచమైన సనూష ఆ తర్వాత ‘రేణిగుంట’, ‘జీనియస్’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా కాస్తా బొద్దుగా ముద్దుగా ఉండే సనూష ఈ మధ్య ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి నాజుగ్గా తయారైంది. ఈ నేపథ్యంలో తన ఫొటోషూట్‌లో భాగంగా ఫోజులిచ్చిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె శరీరాకృతిపై విమర్శలు చేస్తూ..అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. అవి చూసిన సనూష నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరిని అనే ముందు మీరేంటో తెలుసుకొండని, మీరేం అంత పర్ఫెక్ట్ కాదంటూ తనపై నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్లకు చురకలు అట్టించింది. ‘నా శరీర బరువు గురించి నాకంటే ఎక్కువగా బాధపడుతున్న వారందరికి నేను చెప్పేది ఒకటే. ఎదుటి వాళ వైపు వేలెత్తి చూపిస్తే మిగిలిన వేళ్లు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తు పెట్టుకొండి. కాబట్టి ఎదుటి వాళ్లను అనే ముందు ఒక్కసారి మీరెంత పర్ఫెక్ట్గా ఉన్నారో ఆలోచించుకోండి’ అంటూ విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. కాగా సనూష హీరో నాని జర్సీ మూవీలో జర్నలిస్టు పాత్రలో కనిపించింది. -
ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది : సినీ నటి
ప్రతి వ్యక్తి తమ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొకతప్పదు. ఏ ఒక్కరి జీవితం హాయిగా, సంతోషంగా గడిచిపోదు. ఏదో ఒక సమయంలో ఇబ్బంది తలెత్తడం, ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కడం జరుగుతుంటాయి. అయితే కొంత మంది మాత్రం చిన్న ఇబ్బంది ఎదురవ్వగానే డిప్రెషన్ వెళ్లడం, ఆత్మహత్యకి పాల్పడటం లాంటి తప్పిదాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా తన జీవితంలో ఎదురైన ఇబ్బందులను, బయటపడిన విధానం తెలుపుతూ అందరికి కాస్త ధైర్యం నూరిపోద్దామనుకొని నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైంది సినీ నటి సనూష. తెలుగులో నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ చిత్రంలో జర్నలిస్ట్ రమ్య పాత్ర పోషించిన సనూష.., ఇటీవల ఓ ఇంటర్య్వూలో మట్లాడుతూ.. గతంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కొన్ని పరిస్థితుల కారణంగా డిప్రెషన్, మనస్తాపానికి గురయ్యానని చెప్పుకొప్పుకొచ్చింది. ఒకనొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని,దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యానని తెలిపింది. అనంతరం ఓ వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకొని ఆ మానసిక కుంగుబాటు నుంచి బయటకొచ్చానని చెప్పుకొచ్చింది. అయితే, ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు అసభ్యకర రీతిలో కామెంట్లు చేశారు. నెటిజన్లు పెట్టిన కామెంట్లను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ మండిపడింది. డిప్రెషన్‌తో ఇబ్బందిపడేవాళ్లు, తన వీడియో చూసి కొంతమేర ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే తాను మాట్లాడని తెలిపింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలో అడుగుపెట్టిన సనూష్ తెలుగు, తమిళంతో పాటు పలు మలయాళీ సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బంగారం మూవీలో హీరోయిన్ సోదరి వింధ్య పాత్రలో, ఆ తర్వాత ‘జీనియస్’, ‘రేణిగుంట’ సినిమాల్లో కీలకపాత్రల్లో నటించింది. View this post on Instagram I'm sharing one of the comment section that appeared to be on Manorama online story about me and the mental health struggle I've gone through which I shared personally in my YouTube channel. I shared it because I believe at least one person might get help after knowing there are people out there who's going through it & trying just like YOU. See guys I've already told you how SOME IDIOTS take this mental health issues and when someone openly talks about it- this is how they behave. This is how they RUIN it for many people.. I'm sure they are a bunch of sick people who belong to such categories in our society where such stigmas still works out more than truth & wellness. I just have lots of pity for these stupid people who's living in our society thinking they're full of "BUDHI AND BODHAM" yet they suffer from "VIVARAMILLAYMA". GOOD THAT YOU GUYS DONT HAVE IT AND I PRAY NONE OF YOU GO THROUGH SUCH SHIT BECAUSE GOD FORBID, YOU WONT BE ABLE TO HANDLE IT WITH SUCH LIGHTNESS 😇👍 DEPRESSION, ANXIETY AND OTHER SUCH MENTAL HEALTH ISSUES are A VERY SERIOUS ISSUE we all are going through .. AND, if you CANT HELP, STAY SHUT WITH YOUR STUPIDITY & BROKEN ASSES. A post shared by Sanusha Santhosh💫 (@sanusha_sanuuu) on Oct 14, 2020 at 11:15pm PDT -
ఇదా లోకం!
మలయాళీ నటి సనూషకు బుధవారం రాత్రి రైల్లో కన్నూర్ నుంచి తిరువనంతపురానికి ప్రయాణిస్తున్నప్పుడు ఒక చేదు అనుభవం ఎదురైంది! సమాజం మీద సనూషకు నమ్మకం పోగొట్టిన ఘటన అది! రాత్రి ఒంటిగంటప్పుడు తన పెదవులకు ఏదో తగిలినట్లనిపిస్తే చప్పున నిద్ర నుంచి లేచి చూశారు సనూష. ఒకతను ఆమెను ముద్దుపెట్టుకోబోతున్నాడు. సనూష అతని గట్టిగా పట్టుకుని, చెయ్యి మెలితిప్పుతూ, లైట్లు వేసి బోగీలోని మిగతా ప్రయాణికుల్ని అలెర్ట్ చేసింది. ‘ప్లీజ్.. దీన్ని ఇష్యూ చెయ్యకండి’’ అని అతను బతిమాలుతున్నాడు. ఇదంతా గమనిస్తూ కూడా.. బోగీలోని ఒక్కరూ సనూషకు సపోర్టుగా రాలేదు. అతడినీ ఏమీ అనలేదు! చోద్యం చూస్తున్నట్లుగా ఉండిపోయారు. సనూషతో పాటు ప్రయాణిస్తున్న రైటర్ ఉన్ని, రంజిత్ ఇంకొకతను మాత్రం అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తెల్లారే మీడియాకు ఈ విషయం చెబుతూ, సనూష ఎంతో బాధపడ్డారు. ‘‘ఇదే విషయాన్ని నేను ఫేస్బుక్లో పెట్టి ఉంటే ‘ఐయామ్ విత్ సనూష’ అని కామెంట్లు పెట్టేవాళ్లు. వాళ్ల డిస్ప్లే పిక్‌లను కూడా నాకు మద్దతుగా మార్చుకునేవారు. కానీ ఇదంతా సోషల్ మీడియా వరకేనా? నిజ జీవితంలో ఎవరూ బాధితులకు అండగా నిలబడే ధైర్యం చేయలేరా?’’ అని సనూష అన్నారు. అంతేకాదు, ‘‘రాత్రి జరిగిన ఘటన ఈ సమాజంపైన నాకు నమ్మకాన్ని పోగొట్టింది’’ అని ఆవేదన చెందారు. బోగీలో ఆమెను ముద్దుపెట్టుకోబోయిన వ్యక్తి పేరు ‘ఆంటో బోస్’. ‘నేను సనూష అభిమానిని’ అని పోలీసులకు చెప్పుకున్నాడు. అతడి మీద కన్నా కూడా, అతడిని చూస్తూ ఊరుకున్న వారిపైనే సనూష ఎక్కువ కోపంగా ఉన్నారు. -
మరో నటికి లైంగిక వేధింపులు
తమిళసినిమా: హీరోయిన్లపై లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం నటి అమలాపాల్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యాపారవేత్తను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది సద్దుమణుగక ముందే నటి సనూషా అత్యాచార వేధిపులకు గురైంది. మలయాళ నటి అయిన ఈమె తమిళంలో రేణిగుంట, భీమ చిత్రాల్లో నటించిది. ఇటీవల శశికుమార్ చిత్రం కొడివీరన్‌లోనూ నటించింది. బుధవారం రాత్రి కున్నూర్ నుంచి తిరువనంతపురం రైలులో ప్రయాణం చేస్తుండగా ఆంటోబోస్ అనే వ్యక్తి నిద్రిస్తున్న సనూషపై లైంగిక వేధిపులకు పాల్పడ్డాడు. దీనిపై సనూష టీటీఈకి ఫిర్యాదు చేసింది. వెంటనే రైల్వే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అంటోబోస్ తమిళనాడుకు చెందిన వ్యక్తిగా సమాచారం.