ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది : సినీ నటి | Actress Sanusha Trolled For Sharing About Depression And Her Mental Health | Sakshi
Sakshi News home page

ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది : సినీ నటి

Published Sun, Oct 18 2020 6:35 PM | Last Updated on Sun, Oct 18 2020 8:38 PM

Actress Sanusha Trolled For Sharing About Depression And Her Mental Health - Sakshi

ప్రతి వ్యక్తి తమ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొకతప్పదు. ఏ ఒక్కరి జీవితం హాయిగా, సంతోషంగా గడిచిపోదు. ఏదో ఒక సమయంలో ఇబ్బంది తలెత్తడం, ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కడం జరుగుతుంటాయి. అయితే కొంత మంది మాత్రం చిన్న ఇబ్బంది ఎదురవ్వగానే డిప్రెషన్‌ వెళ్లడం, ఆత్మహత్యకి పాల్పడటం లాంటి తప్పిదాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా తన జీవితంలో ఎదురైన ఇబ్బందులను, బయటపడిన విధానం తెలుపుతూ అందరికి కాస్త ధైర్యం నూరిపోద్దామనుకొని నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైంది సినీ నటి సనూష.

తెలుగులో నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ చిత్రంలో జర్నలిస్ట్‌ రమ్య పాత్ర పోషించిన సనూష.., ఇటీవల ఓ ఇంటర్య్వూలో మట్లాడుతూ..  గతంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కొన్ని పరిస్థితుల కారణంగా డిప్రెషన్‌, మనస్తాపానికి గురయ్యానని చెప్పుకొప్పుకొచ్చింది. ఒకనొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని,దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యానని తెలిపింది. అనంతరం ఓ వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకొని ఆ మానసిక కుంగుబాటు నుంచి బయటకొచ్చానని చెప్పుకొచ్చింది. అయితే, ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు అసభ్యకర రీతిలో కామెంట్లు చేశారు.

నెటిజన్లు పెట్టిన కామెంట్లను ఆమె  ఇన్‌స్టాగ్రామ్ లో షేర్‌ చేస్తూ మండిపడింది. డిప్రెషన్‌తో ఇబ్బందిపడేవాళ్లు, తన వీడియో చూసి కొంతమేర ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే తాను మాట్లాడని తెలిపింది.  చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలో అడుగుపెట్టిన సనూష్‌ తెలుగు, తమిళంతో పాటు పలు మలయాళీ సినిమాల్లో నటించింది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన బంగారం మూవీలో హీరోయిన్‌ సోదరి వింధ్య పాత్రలో, ఆ తర్వాత ‘జీనియస్‌’, ‘రేణిగుంట’ సినిమాల్లో కీలకపాత్రల్లో నటించింది. 
 

I'm sharing one of the comment section that appeared to be on Manorama online story about me and the mental health struggle I've gone through which I shared personally in my YouTube channel. I shared it because I believe at least one person might get help after knowing there are people out there who's going through it & trying just like YOU. See guys I've already told you how SOME IDIOTS take this mental health issues and when someone openly talks about it- this is how they behave. This is how they RUIN it for many people.. I'm sure they are a bunch of sick people who belong to such categories in our society where such stigmas still works out more than truth & wellness. I just have lots of pity for these stupid people who's living in our society thinking they're full of "BUDHI AND BODHAM" yet they suffer from "VIVARAMILLAYMA". GOOD THAT YOU GUYS DONT HAVE IT AND I PRAY NONE OF YOU GO THROUGH SUCH SHIT BECAUSE GOD FORBID, YOU WONT BE ABLE TO HANDLE IT WITH SUCH LIGHTNESS 😇👍 DEPRESSION, ANXIETY AND OTHER SUCH MENTAL HEALTH ISSUES are A VERY SERIOUS ISSUE we all are going through .. AND, if you CANT HELP, STAY SHUT WITH YOUR STUPIDITY & BROKEN ASSES.

A post shared by Sanusha Santhosh💫 (@sanusha_sanuuu) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement