నటి సనూషా
తమిళసినిమా: హీరోయిన్లపై లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం నటి అమలాపాల్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యాపారవేత్తను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది సద్దుమణుగక ముందే నటి సనూషా అత్యాచార వేధిపులకు గురైంది. మలయాళ నటి అయిన ఈమె తమిళంలో రేణిగుంట, భీమ చిత్రాల్లో నటించిది. ఇటీవల శశికుమార్ చిత్రం కొడివీరన్‌లోనూ నటించింది. బుధవారం రాత్రి కున్నూర్ నుంచి తిరువనంతపురం రైలులో ప్రయాణం చేస్తుండగా ఆంటోబోస్ అనే వ్యక్తి నిద్రిస్తున్న సనూషపై లైంగిక వేధిపులకు పాల్పడ్డాడు. దీనిపై సనూష టీటీఈకి ఫిర్యాదు చేసింది. వెంటనే రైల్వే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అంటోబోస్ తమిళనాడుకు చెందిన వ్యక్తిగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment