అమలాపాల్‌ తెగువకు హ్యాట్సాఫ్‌: విశాల్‌ | Vishal praised Amala Paul in harrasment case | Sakshi
Sakshi News home page

అమలాపాల్‌ తెగువకు హ్యాట్సాఫ్‌: విశాల్‌

Published Sat, Feb 3 2018 7:07 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Vishal praised Amala Paul in harrasment case - Sakshi

సాక్షి, చెన్నై: నటి అమలాపాల్‌ను కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ ప్రశంసించారు. నటి ధైర్యాన్ని మెచ్చుకుంటూ సెల్యూట్‌ అని ట్వీట్‌ చేశారు విశాల్‌. అమలాపాల్‌ను డ్యాన్స్‌ స్కూల్‌ యజమాని అళగేశన్‌ లైంగికంగా వేధించగా నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలేషియాలో ఓ కార్యక్రమం నిమిత్తం నిర్వహిస్తున్న నృత్య శిక్షణ తరగతులను టీనగర్‌లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి అమలాపాల్‌ను అళగేశన్‌ వేధించాడు. తనపై అళగేశన్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ విషయంపై హీరో విశాల్‌ ట్వీటర్‌ ద్వారా స్పందించారు. ‘లైంగిక వేధింపుల ఘటనలో నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌. ఇలాంటి విషయాలపై మాట్లాడాలంటే ఎంతో తెగువ, ఆత్మవిశ్వాసం ఉండాలి. నటి ఫిర్యాదుపై స్పందించి వెంటనే నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులకు ధన్యవాదాలు’ అంటూ విశాల్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. అమలాపాల్‌పై వేధింపుల ఘటన మరువకముందే తిరువనంతపురం రైలులో ప్రయాణం చేస్తుండగా ఆంటోబోస్‌ అనే వ్యక్తి నిద్రిస్తున్న నటి సనూషపై లైంగిక వేధిపులకు పాల్పడ్డాడు. దీనిపై సనూష ఫిర్యాదు చేయగా వెంటనే రైల్వే పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement