నాతో వ్యాపారం చేయాలనుకున్నారు | Actor Amala Paul says man who sexually harassed her is part of a sex racket | Sakshi
Sakshi News home page

నాతో వ్యాపారం చేయాలనుకున్నారు

Published Tue, Feb 13 2018 8:20 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Actor Amala Paul says man who sexually harassed her is part of a sex racket - Sakshi

అమలాపాల్‌

తమిళసినిమా: తనతో కూడా వ్యాపారం చేయాలని ప్లాన్‌ చేశారని నటి అమలాపాల్‌ అన్నారు. అమలాపాల్‌ ఇటీవల డాన్స్‌ శిక్షణ కోసం టీ.నగర్‌లోని ఒక స్కూల్‌కు వెళ్లింది. అక్కడ అళగేశన్‌ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని మాంబళం పోలీసులకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. కాగా అమలాపాల్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటూ సెల్యూట్‌ అంటూ విశాల్‌ అభినందించారు. ఆయనకు థ్యాంక్స్‌ చెప్పిన అమలాపాల్‌ విశాల్‌ అభినందనలు తనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయం ది. ఈ సందర్భంగా అమలాపాల్‌ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ ‘తనతో మలేషియాలోని కొందరు బడాబాబులు వ్యాపారం చేయాలని పథకం పన్నారని ఆరోపించారు.

ఇలాంటి విషయంలో ప్రతి మహిళా ధైర్యంగా ముందుకొచ్చి తమను తాము కాపాడుకోవాలని హితవు పలికారు. అమలాపాల్‌ మాదిరిగానే పలువురు నటీమణులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. హాలీవుడ్‌ చిత్ర నిర్మాతొకరు పలువురు నటీమణులను లైంగికవేధింపులకు గురిచేసినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. వారంతా ఇలాంటి సంఘటనను ఎదుర్కొనడానికి మీటూ( మేమూ బాధితులమే) అనే అర్థంతో కూడిన హెస్టేక్‌ అనే సామాజికమాద్యమాన్ని ప్రారంభించారు. అందులో నటి అమలాపాల్‌ కూడా తన పేరును నమోదు చేశారట. కాగా అమలాపాల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన అళగేశన్‌ను పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరెవరున్నారన్న కూపీని లాగుతున్నారు. ఈ విచారణలో మలేషియాకు చెందిన మరో కార్మికుడు పట్టుబడ్డాడు. అతని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement