నాతో వ్యాపారం చేయాలని చూశాడు..! | Amala Paul Thanks to vishal in sexual harrasment case | Sakshi
Sakshi News home page

నాతో వ్యాపారం చేయాలని చూశాడు..!

Published Sun, Feb 11 2018 8:18 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Amala Paul Thanks to vishal in sexual harrasment case - Sakshi

సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల కేసులో తనకు మద్ధతుగా నిలిచిన స్టార్ హీరో విశాల్‌కు నటి అమలాపాల్ ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల వేధింపుల కేసులో ధైర్యంగా ఫిర్యాదు చేసి నిందితుడిని అరెస్ట్ అయ్యేలా చేశారు ఈ నటి. ఇది కేవలం కేవలం ఒక్క మహిళ పని కాదని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని విశాల్ అందరికీ తెలిసేలా చేసినందుకు సంతోషంగా ఉంది. నిందితుడు అళగేశన్ నాతో వ్యాపారం చేయాలని చూశాడు. అతడి ధైర్యం, వ్యవహారశైలి, అతడికున్న పరపతి చూసిన నాకు ఎంతో భయంవేసిందని మీటూ మూవ్‌మెంట్‌లో భాగంగా అమలాపాల్ ట్వీట్ చేశారు. 

ఇటీవల అమలాపాల్‌ను డ్యాన్స్‌ స్కూల్‌ యజమాని అళగేశన్‌ లైంగికంగా వేధించగా నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలేషియాలో ఓ కార్యక్రమం నిమిత్తం నిర్వహిస్తున్న నృత్య శిక్షణ తరగతులను టీనగర్‌లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అమలాపాల్‌ను అళగేశన్‌ వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడి లొంగదీసుకునే యత్నం చేశాడు. దీనిపై నటి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి అరెస్ట్, అమలాపాల్ ధైర్యంపై హీరో విశాల్‌ ట్వీటర్‌ ద్వారా స్పందించారు. ‘లైంగిక వేధింపుల ఘటనలో నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌. ఇలాంటి విషయాలపై మాట్లాడాలంటే ఎంతో తెగువ, ఆత్మవిశ్వాసం ఉండాలి. నటి ఫిర్యాదుపై స్పందించి వెంటనే నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులకు ధన్యవాదాలు’ అంటూ విశాల్‌ ట్వీట్ చేశారు. మీటూ క్యాంపెయిన్‌లో భాగంగా నటి అమలాపాల్ తనకు మద్ధతుగా నిలిచిన విశాల్‌కు తాజాగా థ్యాంక్స్ చెప్పారు.  (అమలాపాల్‌ తెగువకు హ్యాట్సాఫ్‌: విశాల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement