bangaram
-
'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా గుర్తుందా? 2006లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన చిన్నారి ఇప్పటికీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంతకీ ఆ చిన్నారి ఇప్పుడేం చేస్తోంది? ఎలా ఉందో తెలుసా? ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం. (ఇది చదవండి: అగ్రహీరోల సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా ప్లాన్!) బంగారం మూవీలో వింధ్య రెడ్డి పాత్రలో కనిపించిన ఈ చిన్నారి అసలు పేరు శనూష. మలయాళంలో బాలనటిగా రెండు రాష్ట్ర స్థాయి సినీ అవార్డులను గెలుచుకుంది. అంతేకాదు మలయాళంలో పలు సినిమాల్లో నటించిన చిన్నారి. బంగారం సినిమాతోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. బంగారం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా శనూష ఎంట్రీ ఇవ్వగా అప్పుడు ఆమె వయస్సు కేవలం 10 సంవత్సరాలే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌ను ఆటపట్టిస్తూ అందరిని ఆకట్టుకుంది. ఇక ఆమె కెరీర్ విషయాకొనిస్తే.. మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా బంగారం సినిమాతో ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత ఐదేళ్లకు జీనియస్ అనే సినిమాతో హీరోయిన్గా అడుగు పెట్టింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా తమిళ్ రీమేక్ చిత్రం రేణిగుంటలో కీలకపాత్రలో పోషించింది. 2019లో నాని హీరోగా వచ్చిన చిత్రం జెర్సీలో జర్నలిస్టు పాత్ర చేసింది. ఆమె పాత్ర చిన్నదే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. శనూష ప్రస్తుతం మళయాళంలో వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. (ఇది చదవండి: ఫస్ట్ డేట్లోనే శృంగారానికి ఓకే: స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by Sanusha Santhosh💫 (@sanusha_sanuuu) -
బంగారం మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
-
బంగారం మూవీలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
Bangaram Movie Child Artist, Sanusha Santhosh Present Photos Goes Viral: పవన్ కల్యాణ్, మీరాచోప్రా జంటగా నటించిన ‘బంగారం’సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా నటించిన అమ్మాయి గుర్తుందా? వింధ్య రెడ్డి పాత్రలో నటించి మెప్పించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సనూషా సంతోష్. బంగారం సినిమాతో బాలనటిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అయితే అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో 20కి పైగా సినిమాల్లో నటించింది. అలా ఉత్తమ బాలనటిగా చిన్న వయసులోనే రెండు సార్లు జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. 2012లో మిస్టర్ మురుగన్ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన సనూషా..ఆ తర్వాత రేణిగుంట, జీనియస్ వంటి చిత్రాల్లోనూ నటించింది. చివరగా నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో జర్నలిస్ట్ రమ్య పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా మళ్లీ మాలీవుడ్‌లోనే స్థిరపడిపోయింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని షేర్ చేస్తుంటుంది. అయితే ఈ అమ్మడి శరీరాకృతిపై కొందరు నెటిజన్లు బాడీ షేమింగ్ చేసినా ధీటుగా జవాబిస్తుంది.ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సానుష..లాక్డౌన్ సమయంలో ఎంతో నిరాశ, ఒంటరితనాన్ని ఫీలయ్యానని, ఆ సమయంలో ఎవరికి తెలియకుండా ఓ మానసిక వైద్యుడిని కూడా సంప్రదించినట్లు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించినట్లు తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గద్దెలపై బంగారం పోగు పూజారులదే...
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతరలో సమ్మక్క–సారలమ్మ గద్దెలపై భక్తులు సమర్పించిన ఎత్తు బంగారం (బెల్లం) పోగు చేసుకునే హక్కు స్థానిక ఆదివాసీ యువకులు, పూజారులుదేనని పూజారులు సిద్దబోయిన ముణేందర్, లక్ష్మణ్‌రావు, భోజరావు, నర్సింగరావు, మహేష్ అన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ అమ్మవార్ల గద్దెలపై భక్తులు సమర్పించిన బెల్లాన్ని గతంలో పూజారులు, స్థానిక ఆదివాసీలు ఉచితంగా తీసుకెళ్లేవారమని తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో గద్దెలపై బెల్లం భారీగా పేరుకుపోవడంతో తొలగించడం కోసం దేవాదాయ శాఖకు ఆర్థిక భారం పడుతుందన్నారు. గత రెండు మూడు జాతరల నుంచి గద్దెలపై బెల్లాన్ని పోగు చేసుకునేందుకు మెయింట్‌నెన్స్ ఖర్చుల కోసం దేవాదాయ శాఖకు టెండర్ రూపంలో డబ్బులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వాకటి కరుణ హయాంలో రాష్ట్రంలో గుడుంబా నిషేధం ఉండడంతో అమె గద్దెలపై బెల్లం టెండర్‌ను పక్కా జిల్లాలో నిర్వహించాలని, అంతే కాకుండా పొరుగు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విక్రయించుకోవాలని అదేశించారన్నారు. అప్పటి నుంచి పక్క జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడంలోని మణుగూరులో దేవాదాయ శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో టెండర్ నిర్వహించి స్థానిక ఆదివాసీ యువకులు, పూజారులకే ఇస్తున్నారని తెలిపారు. ఇటీవల నిర్వహించిన గద్దెలపై బెల్లం టెండర్లో ఐటీడీఏ పీఓకు కానీ, ఇతర అధికారులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆదివాసీల సంఘాల నాయకులు జాతరలో అమ్మవార్ల పూజా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను పూజారులను సంప్రందించిన తర్వాతే ప్రకటనలు జారీ చేయాలని కోరారు. -
నువ్వు బినామీ అయితే... నేను సునామీ!
‘నమస్తే పెద్దిరెడ్డిగారూ...’ ఆహా... పెద్దిరెడ్డి అంటే ఈ భూమారెడ్డికి ఎంత మర్యాదా... ఎంత మర్యాద! అంతేనా? అదిగో... ఈ భూమారెడ్డి వెళ్లి ఆ పెద్దిరెడ్డి కాళ్ల దగ్గర కూర్చొని ఏమంటున్నాడో చూడండి... ‘నిన్న కురిసిన వానకు నేడు మొలకెత్తిన మొలకలం. మేము ఎంత గొప్పవాళ్లమైనా... నీ ముందు ఇంతే కదయ్యా’ వినయం సంగతి అటుంచండి... క్లారిటీ సంగతి చూడండి... హీరో భుజం మీద చెయ్యి వేస్తాడు భూమారెడ్డి... హీరో ఊరుకుంటాడా ఏమిటి? ‘చేయి తీయ్’ అంటాడు. ‘తీయకపోతే?’ అని అడుగుతాడు భూమారెడ్డి. ‘తీస్తాను’ అంటాడు హీరో. ‘ఏ చెయ్యి తీస్తావు? కుడి చెయ్యా? ఎడమ చెయ్యా’ అని క్లారిటీగా అడుగుతాడు భూమారెడ్డి. అలా అని అతని ప్రతి మాటలోనూ క్లారిటీ ఉంటుందని కాదు... ‘లవ్వు సెయ్యెద్దాన్నానుగానీ... పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలిగానీ... లవ్వొద్దు’ అని క్లారిటీ లేకుండా కూడా మాట్లాడగలడు. ఆశుతోష్ రాణా విలనిజానికి ఎన్ని షేడ్స్ ఉన్నాయో ‘బంగారం’ సినిమాలో భూమారెడ్డి పాత్ర చెప్పకనే చెబుతుంది. ‘స్టార్’ కావాలని ఎవరికి మాత్రం ఉండదు. మరి అశుతోష్ అలా అంటాడేమిటి? ఇంతకీ ఏమిటంటాడు? ‘స్టార్’గా కంటే ‘యాక్టర్’గా ఉండడమే ఎక్కువ ఇష్టం అంటున్నాడు. ఒక్కసారి ‘స్టార్’ అయిన తరువాత ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేయాల్సివస్తుంది... అంటాడు ఆశుతోష్. అందుకేనేమో... ‘భిన్నమైన పాత్రలు’ పోషించే నటుడిగా ఆయనకు ప్రేక్షకుల్లో మంచి పేరొచ్చింది. ‘‘చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తున్నానా? అనే సందేహం వచ్చినప్పుడు... ఎవరో వచ్చి... కొద్దిగా రూట్ మార్చమని సలహా ఇవ్వడం కాదు... మనకు మనమే మార్చుకోవాలి.’’ అంటున్నాడు ఆశుతోష్. ఆయన మాటలు కాస్త జాగ్రత్తగా వింటే హీరో, విలన్ అనే కాన్సెప్ట్‌కు కాలం చెల్లిందా? అనే సందేహం కూడా కలుగుతుంది. ‘నటన ముఖ్యం’ అనే సత్యం మది తెర మీద తళుక్కున మెరుస్తుంది. ఆశుతోష్ రాణా రామ్‌నారాయణ్ నిఖ్రా మధ్యప్రదేశ్‌లోని గడర్వార నగరంలో జన్మించాడు. ప్రాథమిక విద్య అక్కడే పూర్తయింది. ‘రామ్‌లీల’లో రావణుడిగా ఎక్కువగా నటించేవాడు. విలన్ పాత్రలో ఉండే మజా ఏమిటో అప్పుడే తెలిసిందేమో! తన ఆధ్యాత్మిక గురువు ప్రభాకర్ శాస్త్రి్త్ర సలహా ప్రకారం ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చేరాడు. మహేష్‌భట్ డెరైక్ట్ చేసిన 500 ఎపిసోడ్ల టీవి సీరియల్ ‘స్వాభిమాన్’లో ‘రోనీ’ పాత్రతో ప్రేక్షకులను పలకరించాడు ఆశుతోష్. ‘రెండవ ఛాన్సు’ కోసం ఎదురుచూడకుండానే అవకాశాలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ సినిమా ‘దుష్మన్’లో ‘కోల్డ్ బ్లడెడ్ మర్డరర్’ ‘సైకోపాత్ కిల్లర్’గా తన విలనిజాన్ని వీరలెవెల్లో ప్రదర్శించాడు ఆశుతోష్. కెరీర్ ప్రారంభంలోనే తన నటనతో ‘పాత్ర’కు బలాన్ని ఇచ్చాడు. ‘లక్’ అనేదానికి రాణా ఇచ్చిన నిర్వచనం ఇది... ‘కష్టానికి, అవకాశం తోడైతే... అదే లక్’ అందుకే ‘లక్’ ఉంటే పాత్ర క్లిక్ అవుతుంది. ‘లక్’ ఉంటే అవకాశాలు వస్తాయి. ‘లక్’ ఉంటే కెరీర్ ఊపందుకుంటుంది... ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు ఆశుతోష్ రాణా. అందుకే ‘సాధన’కు ఎప్పుడూ దూరం కాలేదు. దాని ప్రభావం వృథా పోలేదు. ‘ఆశుతోష్ రాణా అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడు’ అనిపించుకున్నాడు. ‘ఇది నటన’ ‘ఇది మాత్రమే నటన’ అని కొలవడానికి సాధనాలేమీ లేవు అంటున్న రాణా... ప్రతి నటుడిలోని తనదైన వైవిధ్యం ఉంది అంటాడు. ఆ వైవిధ్యం చూపించడమే ‘ప్రతిభ’ అంటాడు. ‘నటనలో దమ్ముంటే... విలన్‌లోనూ హీరోను చూపించవచ్చు’ అని నమ్ముతాడు రాణా. బాలీవుడ్లో ఎన్ని రకాల పాత్రలు చేసినా... దక్షిణాది చిత్రాల్లో మాత్రం... ఆశుతోష్= విలన్! ‘వెంకీ’ ‘బంగారం’ ‘ఒక్క మగాడు’ ‘విక్టరీ’ ‘బలుపు’ ‘తడాఖా’ ‘పటాస్’ ‘చుట్టాలబ్బాయి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే మన ‘ఉత్తమ విలన్’ అయ్యాడు. పోటీలోనే కాదు. జీవితంలోను గెలవనోడు బతకకూడదు. (బంగారం సినిమాలో డైలాగ్) -
'డిప్యూటీ' వెయిట్ @ 78
వరంగల్ : మేడారం మహాజాతరను పురస్కరించుకుని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గురువారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో జాతరకు చేరుకున్న కడియంకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు పట్టు వస్త్రాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం 78 కిలోల ఎత్తు బంగారాన్ని అమ్మవారికి కడియం సమర్పించుకున్నారు. అలాగే కడియం మనవరాలు, మంత్రి చందూలాల్, ఎంపీ కవిత భర్త అనిల్ తదితరులు కూడా బంగారం సమర్పించారు.