ఏ తల్లిదండ్రి అయినా సంతృప్తిగా.. సంతోషంగా.. ఉన్నారు అంటే వారి పిల్లల ఎదుగుదలను చూసినపుడే.. అనేది వంద శాతం వాస్తవం. పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యాక కొంతమంది సంతోష పడితే, మరికొందరు మాత్రం బుడిబుడి అడుగులు వేస్తున్ననాటి నుంచి తల్లిదండ్రులను ఎంతో సంతోష పెడుతున్నారు. ఆ కోవకు చెందినదే మన బాల్యనటి సహస్ర. చిన్నతనం నుంచి తన నటనతో ఎంతో మంది హృదయాల్లో నిలిచింది. మాటీవిలో ప్రసారమయ్యే ‘పాపే మా జీవన జ్యోతి’ ధారావాహిక చైల్డ్ ఆర్టిస్ట్ కుట్టి పాత్రలో జీవిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందుతోంది ఈ సహస్ర.
– చింతల్
సహస్ర ప్రస్థానం ఇలా..
► నిజాంపేటలోని భాగ్యలక్ష్మిహిల్స్‌లో నివాసముండే దర్పల్లి అనిల్‌కుమార్, లీలా దంపతులకు 2013 డిసెంబర్ 9వ తేదీన సహస్ర జన్మించడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
► తండ్రి అనీల్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే కుత్బుల్లాపూర్ హెచ్‌ఎంటీ కాలనీలో నిర్మాణ్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని నడిపిస్తూ తనవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తుండగా, తల్లి ప్రైవేట్ టీచర్‌గా కొనసాగుతోంది.
► చిన్నతనంలోనే సహస్ర హావభావాల వీడియోలను అనీల్‌కుమార్ దంపతులు మొబైల్‌లో రికార్డ్ చేస్తూ ఉండేవారు.
చిన్ననాటి నుంచే డ్యాన్స్‌లో..
► పువ్వుపుట్టగానే పరిమళించును అన్న చందంగా చిన్ననాటి నుంచే సహస్ర టీవీలో వచ్చే పలు ప్రకటనలు, సీరియల్స్‌ను ఆసక్తిగా గమనించేది.
►సహస్ర తల్లిదండ్రులు అనీల్‌కుమార్, లీల దంపతులు విద్యావంతులు కావడంతో తమ కుమార్తెకు ప్రోత్సాహాన్ని అందించారు.
► తమకు తెలిసిన మిత్రుల సహాకారంతో సహస్ర పోషించిన పాత్రలు, నృత్యాలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమమైన యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు.
► ఆ విధంగా బుల్లితెరకు పరిచయమై తన సహజమైన నటనతో ‘పాపే మా జీవనజ్యోతి’ అనే మాటీవీ సీరియల్‌లో కుట్టి పాత్రకు ఎంపికైంది.
► ఇలా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన సహస్ర తనకు ఇచి్చన కుట్టి పాత్రకు జీవం పోస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకుంది.
తెలుగు భాషపై పట్టు..
► సహస్ర జేన్‌ఎటీయూ కూకట్‌పల్లిలోని నారాయణ హైస్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది.
► ఈ బాల నటి గ్రామీణ భాష నుంచి నవీన భాషలోని మాండళికం తన తోటి కళాకారులను సైతం అబ్బురపరుస్తూ.. భావితరాలకు స్ఫూర్తిదాయకమై.. సినీ వినీలాకాశంలో తళుక్కున మెరుస్తున్న నక్షత్రం ఈ సహస్ర.
► తెలుగు కళామతల్లి వడిలో ఓనమాలు దిద్దుకుంటున్న ఈ చిన్నారి మున్ముందు సినీ రంగంలో ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని ఆశిస్తూ.. నేటి చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆశీర్వదిద్దాం.
అన్నింటిలోనూ ముందే..
చదువుతో పాటు నటన, నాట్యం, సంగీతంలో తన ప్రతిభను చాటుతోంది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పలు సీరియళ్లకు, సినిమాలకు తన వాయిస్‌ను సైతం అందిస్తోంది. చక్కని ప్రతిభతో అనేక వెబ్ సిరీస్‌లలో న టిస్తోంది. పలు వ్యాపార సంస్థల ప్రకటనల్లో వంట పాత్రలను కడిగినంత సులువుగా తనకు తానే పోటీగా ఇచ్చిన పాత్రలో అంతలా ఒదిగి పోతుంది ఈ చిచ్చర పిడుగు.
Comments
Please login to add a commentAdd a comment