Vikramarkudu Child Artist Annie Turns As A Heroine With Thika Maka Thanda Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Thika Maka Thanda: హీరోయిన్‌గా మారిన ‘రాజన్న’ చైల్డ్‌ ఆర్టిస్ట్‌

Published Sat, Aug 5 2023 4:39 PM | Last Updated on Sun, Aug 6 2023 12:04 PM

Thika Maka Thanda Movie: Child Artist Annie Turns As A Heroine - Sakshi

టాలీవుడ్‌లో చాలా మంది చైల్డ్‌ ఆరిస్టులు హీరోయిన్‌గా మరి బాక్సాఫీస్‌ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే వారిలో కొద్ది మంది మాత్రమే నిలదొక్కుకొని స్టార్‌ హీరోయిన్లుగా రాణించారు. తాజాగా రాజన్న లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన మెప్పించిన ఆని హీరోయిన్‌గా మారింది. ఆమె కథానాయికగా పరిచయం కాబోతున్న తొలి చిత్రం ‘తికమక తాండ’. రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా నటిస్తున్నారు.టిఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూసర్‌ తిరుపతి శ్రీనివాసరావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. గౌతమ్‌మీనన్‌, చేరన్‌, విక్రమ్‌ కె.కుమార్‌ వంటి దర్శకుల దగ్గరర కో డైరెక్టర్ గా  పని చేసిన వెంకట్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

1990 నేపథ్యంలో సాగే ఈ కథలో ఆని పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. దర్శకుడు వెంకట్‌ మాట్లాడుతూ.. సమాజంలో ఎప్పటినుండో ఉన్న ఒక సమస్య, ఆ సమస్య వల్ల ఒక గ్రామం అంతా మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారనే సామాజిక అంశంతో ఈచిత్రం తెరకెక్కుతోంది. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామంలో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం. రామక్రిష్ణ, హరిక్రిష్ణ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆని నటన ఈ చిత్రానికి ప్రత్యేకంగా నిలుస్తుంది.

‘కుటుంబ ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుంది. సురేశ్‌ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సిద్‌ శ్రీరామ్‌ పుత్తడి బొమ్మ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో 11 లక్షల వ్యూస్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది’అని నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement