Annie
-
తికమకతాండ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: తికమకతాండ నటీనటులు: హరికృష్ణ, రామకృష్ణ, యాని,రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ తదితరులు నిర్మాణ సంస్థ:టి ఎస్ ఆర్ మూవీమేకర్స్ నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు దర్శకత్వం : వెంకట్ సంగీతం: సురేశ్ బొబిల్లి సినిమాటోగ్రఫీ: హరికృష్ణన్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. తికమకతాండ అనే గ్రామంలోని ప్రజలందరికి మతిమరుపు అనే సమస్య ఉంటుంది. రచ్చబండతో సహా ప్రతి ఏరియాను గుర్తుపెట్టుకోవాడానికి పలకపై పేర్లను రాసి అక్కడ తగిలిస్తారు. మతిమరుపు కారణంగా అనేక సమస్యలు వస్తాయి. దీంతో తమకున్న మతిమరుపు సమస్యను తొలగించుకోవడం కోసం అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటారు. అంతా జాతరకు సిద్ధమైన సమయంలో అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అసలు అమ్మవారి విగ్రహం ఎలా మాయమైంది? ఆ ఊరి జనాలకు మతిమరుపు సమస్య ఎలా వచ్చింది? ఆ ఊరి సమస్యను తీర్చడానికి రంగంలోకి దిగిన హీరోలకు ఎదురైన సమస్యలు ఏంటి? విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి వాళ్లు పడిన కష్టమేంటి? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో తిమకతాండ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే... ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం .. అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనేదే ఆ మూవీ కథాంశం. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ..తెరపై అంతే కొత్తగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు.ఫస్టాఫ్ అంతా ఊరి వాళ్ళ మతిమరుపుతో కాస్త కామెడీ, హీరోల ప్రేమ కథలతో సాగుతుంది. యాదమ్మ రాజు కామెడీ నవ్వులు పూయిస్తుంది. విగ్రహం మాయమవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. విగ్రహం తీసుకురావడానికి హీరో రంగంలోకి దిగడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం సీరియస్‌గా సాగుతుంది. కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ..క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. లాజిక్స్‌ని పక్కకి పెట్టి చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ లవ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికొస్తే.. ఈ చిత్రంలో హీరోలుగా హరికృష్ణ రామకృష్ణ నటించారు.వారిద్దరికి ఇది తొలి సినిమానే అయినా.. చక్కగా నటించారు. డ్యాన్స్‌తో పాటు యాక్షన్స్ సీన్స్ కూడా అదరగొట్టేశారు.రాజన్న మూవీ లో మల్లమ్మ పాత్ర పోషించినయాన్ని ఈ సినిమాలో మల్లికగా కథానాయక గా పరిచయమైంది. ఊరు అమ్మాయి పాత్రలో గాని చాలా అద్భుతంగా నటించింది ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించింది. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్‌లో నిజంగా పుత్తడి బొమ్మలానె అనిపించింది. ఇంకో హీరోయిన్గా రేఖా నిరోషా నటించింది. నిడివి తక్కువైనా తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. ఇక దర్శకుడు వెంకట్ పాత్రకు వస్తే దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా తన ఏంటో నిరూపించుకున్నారు. శివన్నారాయణ గారు బుల్లెట్ భాస్కర్ యాదవరాజు ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే..హరికృష్ణన్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్. సిద్ శ్రీరామ్ పాడిన ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమా చూస్తే అర్థమతుంది. -
Baby Annie Photos: హీరోయిన్గా మారిన 'రాజన్న' చిన్నారి ఆని (ఫోటోలు)
-
హీరోయిన్గా...
బాల నటిగా పలు చిత్రాల్లో నటించిన ఆని కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం ‘తికమక తాండ’. రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా బాలవెంకట్ దర్శకత్వంలో తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‘‘1990లో గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ సమస్య వల్ల ఒక గ్రామ ప్రజలు మతిమరుపుతో బాధపడుతుంటారు. దాన్నుంచి ఎలా బయటపడ్డారనే అంశంతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
హీరోయిన్గా మారిన ‘రాజన్న’ చైల్డ్ ఆర్టిస్ట్
టాలీవుడ్లో చాలా మంది చైల్డ్ ఆరిస్టులు హీరోయిన్గా మరి బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే వారిలో కొద్ది మంది మాత్రమే నిలదొక్కుకొని స్టార్ హీరోయిన్లుగా రాణించారు. తాజాగా రాజన్న లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మెప్పించిన ఆని హీరోయిన్గా మారింది. ఆమె కథానాయికగా పరిచయం కాబోతున్న తొలి చిత్రం ‘తికమక తాండ’. రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా నటిస్తున్నారు.టిఎస్ఆర్ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాసరావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. గౌతమ్‌మీనన్, చేరన్, విక్రమ్ కె.కుమార్ వంటి దర్శకుల దగ్గరర కో డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే ఈ కథలో ఆని పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. సమాజంలో ఎప్పటినుండో ఉన్న ఒక సమస్య, ఆ సమస్య వల్ల ఒక గ్రామం అంతా మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారనే సామాజిక అంశంతో ఈచిత్రం తెరకెక్కుతోంది. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామంలో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం. రామక్రిష్ణ, హరిక్రిష్ణ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆని నటన ఈ చిత్రానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘కుటుంబ ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుంది. సురేశ్ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సిద్ శ్రీరామ్ పుత్తడి బొమ్మ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో 11 లక్షల వ్యూస్ తెచ్చుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది’అని నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు అన్నారు. -
ఒంటరి సమూహం
సుమారు ఆరు దశాబ్దాలుగా అలుపెరగకుండా రాస్తున్న ‘అత్యంత ప్రాధాన్యం గల స్త్రీవాద రచయిత్రి’ ఆనీ ఎర్నౌను 2022 నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ఈ గౌరవం దక్కిన తొలి ఫ్రెంచ్ మహిళ ఆమె. ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారం పొందిన పదిహేడో మహిళ. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; అయినా కూడా మహిళలు, అణిచివేతకు గురైనవారి పోరాట గాథలను సజీవంగా ఉంచుతున్నానంటారు 82 ఏళ్ల ఆనీ ఎర్నౌ. శరీరం, లైంగికత; సాన్నిహిత్య సంబంధాలు; సామాజిక అసమానతలు; చదువు ద్వారా వర్గాన్ని మార్చుకునే ప్రయత్నం ఆమె రచనల్లో కనబడతాయి. ఫ్రాన్స్‌లోని చిన్న పట్టణం నార్మండీలో వారి కుటుంబం నివసించింది. బతకడానికి నాకు పుస్తకాలు అక్కర్లేదని కరాఖండీగా చెప్పే తండ్రిని కలిగిన అతి సాధారణ నేపథ్యం. ఒక కెఫే యజమానిగా అలెగ్జాండర్ డ్యూమా, ఫ్లాబర్ట్, ఆల్బర్ట్ కామూ లాంటి రచయితలను చదవడం వల్ల తనకేం ఒరుగుతుందని ఆయన నిశ్చితాభిప్రాయం. కానీ ఆనీలో అది పూర్తి విరుద్ధంగా పనిచేసింది. పుస్తకాలు మాత్రమే తనకు అత్యంత ప్రీతికరమైనవనీ, ఎంత చెడ్డ జీవితంలోనూ తనను తాను ఒక ‘అ–పాఠకురాలిగా’ ఊహించలేననీ అంటారామె. ఆరేళ్ల వయసు నుంచే అక్షరంలోని గమ్మత్తుకు ఆకర్షితురాలయ్యారు. వందలాది పుస్తకాలను ఉచితంగా చదువుకోవడం కోసమే పుస్తకాల షాపులో పనిచేయాలని కలగన్నారు. ఒక శ్రామిక కుటుంబంలో పుట్టి, బుద్ధెరిగాక మధ్యతరగతి జీవితాలతో పోల్చుకున్నప్పుడు తమ పరిస్థితి పట్ల సిగ్గుపడిన ఆనీ ఎర్నౌ చదువుకోవడం ద్వారా జీవితాలను మార్చుకోగలమన్న అభిప్రాయానికి చాలా త్వరగా వచ్చారు. దానికి అనుగుణంగానే ముందు టీచర్‌గా, అనంతరం లిటరేచర్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వర్జీనియా వూల్ఫ్ అంటే ఆనీకి పిచ్చి అభిమానం. సైమన్ ది బోవా ఆమె చైతన్యాన్ని విస్తృతపరిచారు. స్త్రీవాదం అనేది తప్పనిసరైనది అన్న అవగాహనతో ఇరవై ఏళ్ల వయసు నుంచే తన రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. తన కుటుంబానికి తెలియకుండా చేయించుకున్న అవాంఛిత గర్భస్రావం గురించి ‘క్లీన్డ్ ఔట్’ రాశారు. ఆ అనుభవంలోని జుగుప్స, భయానకాలకు వెరవకుండా, దీన్నే పునర్దర్శనంలాగా ‘హ్యాపెనింగ్’ రాశారు. ఒక స్త్రీ తన శరీరం మీద తన నియంత్రణనూ, స్వాతంత్య్రాన్నీ స్థాపించుకోవడానికి సంబంధించిన అతిముఖ్యమైన నవలగా ఇది నిలిచిపోయింది. తను దాటివచ్చిన జీవిత దశలనే ఆనీ పుస్తకాలుగా మలిచారు. ఆమె కౌమార జీవితం ఒక పుస్తకం. వైవాహిక జీవితం ఒక పుస్తకం. తూర్పు యూరోపియన్ మనిషితో ప్రేమ వ్యవహారం(ప్యాషన్ సింపుల్) ఇంకో పుస్తకం. తల్లి మరణం ఒక పుస్తకం. బ్రెస్ట్ క్యాన్సర్ అనుభవాలు మరో పుస్తకం. ఫ్రాన్స్ చరిత్రతో ముడిపడిన ‘ది ఇయర్స్’ను ఆమె మ్యాగ్నమ్ ఓపస్‌గా పరిగణిస్తారు. ఉత్తమ పురుష(నేను) కథనాలకు భిన్నంగా దీన్ని థర్డ్ పెర్సన్లో రాశారు. ఏ వ్యక్తిగత అనుభవమో ‘పొరపాటున’ సాహిత్యంలోకి వస్తే– దానికీ, తనకూ ఏ సంబంధమూ లేదని ఒక డిస్‌క్లెయిమర్ లాంటిది ఆ రచయిత తగిలించడం కొత్త సంగతేం కాదు. మరీ ముఖ్యంగా సంక్లిష్ట కుటుంబ సంబంధాలు, సన్నిహిత మానవ సంబంధాలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు మరీ ఎక్కువ. ఇక వ్యక్తిగతం అన్నదే కొందరికి నిషిద్ధాక్షరి. వ్యక్తి నుంచి కూడా సమాజాన్ని దర్శించవచ్చునన్న అవగాహన ఉన్నవాళ్లు తక్కువ. కానీ ఆనీ ఎర్నౌ సాహిత్య సర్వస్వం ఆత్మకథాత్మకమే. ఇది కల్పన అని చెబితే రచయితకో రక్షణ కవచం ఉంటుందన్న ఆలోచన ఆమెకు లేక కాదు. కానీ అది మోసం చేయడంలా భావించారు. వ్యక్తిగత జీవితాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షించుకున్నంత కచ్చితత్వంతో తన అనుభవాలను నమోదు చేశారు. అందువల్లే ఆమె ‘గ్రేట్ ట్రూత్ టెల్లర్ ఆఫ్ ఫ్రాన్స్’గా నిలవగలిగారు. నార్మండీ లాంటి చిన్నపట్టణంలో తన జీవితాన్నీ, తండ్రితో తన సంబంధాన్నీ ‘ఎ మ్యాన్స్ ప్లేస్’గా రాస్తున్నప్పుడు తన రచనాపద్ధతిని గురించి ఆమె ఘర్షణపడ్డారు. తండ్రిని ఒక కాల్పనిక పాత్రగా మలవడంలో తన రచనా ఉద్దేశమే నెరవేరదని భావించారు. అందుకే ఉన్నది ఉన్నట్టే రాయడానికి సంకల్పించారు. అందుకే ఆమెను ఫిక్షన్ రచయిత అనాలా, నాన్–ఫిక్షన్ రచయిత అనాలా అన్న చర్చకూడా వచ్చింది. కొందరు ఆమెను ‘మెమొయిరిస్ట్’ (జ్ఞాపకాల రచయిత) అన్నారు. నవలగా, ఆత్మకథగా కాకుండా తన రచనలను ఆటోసోషియోబయోగ్రాఫికల్(సామాజిక ఆత్మకథ)గా మలవగలగడం ఆమె ప్రత్యేకత. చరిత్ర, ఆత్మకథల కలగలుపు ఆమె పద్ధతి. ఇంట్లో పుస్తకాలను చూసి, ఇవన్నీ చదువుతావా అని ఆశ్చర్యపోయిన తన కజిన్, పుస్తకాలతో మనుషులకేం పని అన్నట్టుగా బతికిన తన తండ్రిలాంటివాళ్లు నిజానికి తనకు ఎక్కువ స్ఫూర్తి కలిగించారని చెప్పే ఆనీ... మర్చిపోయి అంతర్ధానమయ్యే లోపల జ్ఞాపకాలను పదిలపరుస్తున్నానంటారు. ఫ్రాన్స్ ఉమ్మడి జ్ఞాపకాలను ఆమె తన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అనువాదాల ద్వారా అవి ప్రపంచ స్మృతులుగా కూడా మారాయి. తన ప్రపంచంగా అనిపించని పారిస్ విలాసాలకు దూరంగా ప్రకృతి, నిశ్శబ్దాల కోసం సబర్బన్ ప్రాంతంలో నివసించే ఆనీ ఎర్నౌ... ఒక దశలో ‘మహిళా విప్లవం’ చూడకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డానంటారు. కానీ అబార్షన్ హక్కులు రావడానికీ, స్త్రీ శరీరం మీద మారుతున్న పురుష ప్రపంచ ధోరణికీ ఆమె కూడా ఒక కారణం అయ్యారు. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; కానీ ప్రయోజనం లేకుండా మాత్రం ఉండదు. -
Annie Ernaux: స్వీయ అనుభవాలే సాహిత్యం
ఆనీ ఎర్నౌకు 23 ఏళ్లు ఉండగా అవాంఛిత గర్భం వచ్చింది. దాంతో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది జరిగింది 1963లో. 1999లో ఈ అనుభవాన్ని ఆమె నవలగా రాసింది. 130 పేజీల ఈ నవల 2000 సంవత్సరంలో ‘హ్యాపెనింగ్’ పేరుతో వెలువడి సంచలనం రేపింది. కాల్పనిక సాహిత్యం రాసే ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ ఆ రకమైన సాహిత్యాన్ని వదిలిపెట్టి స్వీయ జీవితంలోని పరాభవాలు, ఆందోళనలు దాపరికం లేకుండా రాయడం కూడా సాహిత్యమేనని గ్రహించింది. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ ప్రెయిజ్ గెలుచుకున్న ఆనీ ఎర్నౌ ఇంగ్లిష్‌లో రాయకున్నా ఈ బహమతి గెలుచుకున్న అతి కొద్దిమంది మహిళల్లో ఒకరు. ఆమె గురించి... ఆమె పుస్తకాల గురించి... ‘ఇది పురుషాధిక్య ప్రపంచం. దీనిని బోనెక్కించాల్సిన సమయం వచ్చినప్పుడు బోనెక్కించాల్సిందే’ అంటుంది 82 సంవత్సరాల ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన– చట్ట విరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి రావడాన్ని– 1999లో ఫ్రెంచ్‌లో ‘ఇవెన్మో’ పేరుతో నవలగా రాస్తే మరుసటి సంవత్సరం అది ‘హ్యాపెనింగ్’ పేరుతో ఇంగ్లిష్‌లో అనువాదం అయ్యి వెలువడింది. ఆ సందర్భంగా ఆనీ ఎర్నౌ అన్న మాట అది. ‘నా జీవితంలో నాకు జరిగింది రాయడం ఎందరో స్త్రీలకు గొంతునివ్వడమే’ అని ఆమె అంది. ‘నాకు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అది నా వ్యక్తిగతమైన విషయంగా మిగల్లేదు. బయటపడితే నా కుటుంబం మొత్తం సామాజిక నీతిలో విఫలమైందన్న విమర్శను మోయాల్సి వచ్చేది’ అంటుందామె. కాకతాళీయమే అయినా ఇండియాలో అబార్షన్ గురించి సుప్రీంకోర్టు స్త్రీలకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన సందర్భంలోనే అబార్షన్ గురించి, స్త్రీల దైహిక వేదనల గురించి, మనో సంఘర్షణల గురించి, వారికి మాత్రమే ఎదురయ్యే అనుభవాల గురించి అది కూడా శ్రామిక వర్గ కోణం నుంచి విస్తృతంగా రాసిన ఆనీ ఎర్నౌకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఇప్పటి వరకు 119 మంది నోబెల్ సాహిత్య బహుమతి లభిస్తే వారిలో కేవలం 16 మందే స్త్రీలు. ఆనీ ఎర్నౌ 17వ రచయిత్రి. బాల్యం నుంచి గుణపాఠాలే ఫ్రాన్స్‌లోని ఇవెట్తో అనే ఊళ్లో చిన్న పచారీ కొట్టు నడిపేవారు ఆనీ తల్లిదండ్రులు. తండ్రికి పట్టకపోయినా జీవితాలు మారాలంటే చదువు ముఖ్యం అని ఆమె తల్లి గట్టిగా భావించింది. దాంతో తమ స్థాయికి చెందకపోయినా కాస్త మంచిబడిలో ఆనీని చేర్పించింది. ఆ బడికి కలిగిన పిల్లలు వచ్చేవారు. ‘అక్కడే నాకు తొలిపాఠం తెలిసింది. శ్రామిక వర్గానికి దక్కే మర్యాదలు కూడా తెలిశాయి. నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటూ బతకాల్సి రావడం కంటే ఘోరమైన విషయం లేదు. మన స్థాయికి మించిన విషయాల్లో అడుగు పెట్టకూడదని నాకు గట్టిగా అందిన సందేశం అందింది’ అంటుందామె. ఆమె తన స్వీయానుభవాల ఆధారంగా ‘ఏ గర్ల్స్ స్టోరీ’ (2016) అనే నవల రాసింది. ‘18 ఏళ్ల అమ్మాయి స్టూడెంట్స్ క్యాంప్‌లో లైంగిక అనుభవం పొందితే అది సంతోషకరంగా ఉండాలి. కాని ఇది తెలిసిన వెంటనే మగ విద్యార్థులు ఆ అమ్మాయిని గేలి చేశారు. ఆమె అద్దం మీద అసభ్యకరంగా రాసి వెక్కిరించారు. ఎన్నాళ్లు గడిచినా నైతికంగా పతనమైన భావనను కలిగించారు’ అని రాసిందామె. చదువు ముగిశాక ఆమె టీచర్‌గా మారి ఆనీ ఎర్నౌ 2000 సంవత్సరంలో రిటైరయ్యి పూర్తికాలం రచయిత్రిగా రచనలు కొనసాగిస్తూ ఉంది. సూటిగా, సులభంగా ఆనీ ఎర్నౌ రచనా శైలి సూటిగా సులభంగా ఉంటుంది. నేరుగా పాఠకులకు అందేలా ఆమె వచనశైలి ఉంటుంది. నోబెల్ కమిటీ కూడా ఇదే మాట అంది. ‘ఆమె సాహిత్యం అత్యంత సాధారణ భాషలో అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది’ అని అభిప్రాయపడింది. ఆనీ ఎర్నౌ రాసిన పుస్తకాల్లో ‘క్లీన్డ్ ఔట్’ (1974), ‘షేమ్’ (1997), ‘గెటింగ్ లాస్ట్’ (2001), ‘ది ఇయర్స్’ (2008) ముఖ్యమైనవి. 1988లో పారిస్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక సోవియెట్ దౌత్యవేత్తతో ఆనీ ఎర్నౌ బంధం ఏర్పరుచుకుంది. అతడు ఆమె కంటే 12 ఏళ్లు చిన్నవాడు. కొంత కాలానికి ఆ బంధం ముగిసింది. ఆ సమయంలో తన భావోద్వేగాలను ‘గెటింగ్ లాస్ట్’ పేరుతో నవల రాసిందామె. అలాగే తన గురించి, ఫ్రాన్స్ సమాజం గురించి రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఇటీవలి కాలం వరకూ జరిగిన ఘటనలను ‘ది ఇయర్స్’గా రాసింది. ఒక రకంగా ఇది స్వీయ చరిత్ర, ఫ్రాన్స్ చరిత్ర కూడా. స్త్రీ పక్షపాతి ఆనీ ఎర్నౌ తనను తాను ‘రచనలు చేసే మహిళ’గా చెప్పుకున్నా ఆమె స్త్రీ పక్షపాతి. స్త్రీవాద ఉద్యమానికి ప్రోత్సాహకురాలు. ‘రాజకీయాలు భ్రష్టుపట్టిన ఈ సమయంలో ఫెమినిస్టులే సరిహద్దులను ప్రశ్నిస్తూ కొత్త ఆలోచనలను చేస్తూ ఆశలు రేకెత్తిస్తున్నారు’ అంటుందామె. ఇటీవల జరిగిన మీటూ ఉద్యమం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘తమతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే స్థితిని స్త్రీలు ఇక మీద ఏ మాత్రం అంగీకరించరు’ అంటారామె. ‘నేను రాయగలను కాబట్టే నాకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి’ అని చెప్పుకున్న ఆనీ రాయగలిగే మహిళలంతా తమ జీవన అనుభవాలను బెరుకు లేకుండా చెప్పడాన్ని ప్రోత్సహిస్తుంది. అప్పుడే స్త్రీలు, స్త్రీలతో ఉన్న సమాజం మరింత మెరుగ్గా అర్థమవుతాయి. స్వీయ అనుభవాలే రచనలు ఆనీ ఎర్నౌ ఏవో ఊహించి కథలు అల్లడం కన్నా తన జీవితంలో జరిగినవే రాయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమె జ్ఞాపకాల రచయిత్రి అయ్యింది. మన జీవితంలో జరిగినదాన్ని రాయడం వల్ల మిగిలినవారు పోల్చుకోవడానికో, సహానుభూతి చెందడానికో అది ఉపయోగపడుతుంది అంటుందామె. మనుషులు వేరే చోట్ల ఉన్నా వారు భావోద్వేగాలు ఒకటే కదా. ఆనీ ఎర్నౌ రాసిన ‘హ్యాపనింగ్’ నవల ఒక కాలపు ఫ్రాన్స్‌లో స్త్రీల సంఘర్షణను సూటిగా నిలపడంతో ఆమెకు ప్రశంసలు వచ్చాయి. 1963లో ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వస్తే ఆ తర్వాత 12 ఏళ్లకు కాని ఫ్రాన్స్‌లో (అవివాహితులకు) అబార్షన్‌ను చట్టబద్ధం చేయలేదు. ‘అబార్షన్ హక్కు లేకపోవడం అంటే.. చట్టం, సంఘపరమైన నియమాలు వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా ధ్వంసం చేయడమే’ అంటుందామె. -
2021లో దేశంలో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన మొబైల్ యాప్ ఇదే..!
కరోనా మహమ్మారి దెబ్బకు 2020లో చాలా మంది తమ సమయాన్ని ఎక్కువ శాతం మొబైల్లోనే గడిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యాప్ యాన్నీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2021లో కూడా అదే దొరణి కొనసాగింది. 2021లో భారతీయులు మొబైల్లో 699 బిలియన్ గంటలకు పైగా సమయాన్ని గడిపారని యాప్ యాన్నీ తాజా స్టేట్ ఆఫ్ మొబైల్ 2022 నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా యాప్ యాన్నీ మొబైల్లో గడిపిన మొత్తం సమయం 3.8 ట్రిలియన్ గంటలు. మొబైల్ వినియోగం పరంగా చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఇన్ స్టాగ్రామ్ @ నెంబర్ వన్ 2020 నుంచి 2021 వరకు మొబైల్ వినియోగం స్వల్పంగా తగ్గిన చైనాతో పోలిస్తే ఇది ఎక్కువ అని నివేదిక చూపుతోంది. 2020లో భారతీయులు 655 బిలియన్ గంటల సమయం మొబైల్లో గడిపితే, అంతకు ముందు ఏడాది 510 బిలియన్ గంటలు గడిపారు. ఈ గణాంకాలు ఆశ్చర్యకరంగా లేవు, ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గల దేశం. దేశంలో వినోదం, కమ్యూనికేషన్, గేమ్స్ కోసం ఎక్కువ శాతం మంది తమ సమయాన్ని మొబైల్లో గడుపుతున్నారు. యాప్ డౌన్లోడ్ పరంగా చూసిన భారతదేశం రెండవ స్థానంలో ఉంది. 2021లో గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో 26.7 బిలియన్ డౌన్ లోడ్స్ జరిగాయి. యాప్ యాన్నీ నివేదిక ప్రకారం.. ఇన్ స్టాగ్రామ్ 2021లో భారతదేశంలో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్ గా నిలిచింది. అత్యధిక సంఖ్యలో నెలవారీ యాక్టివ్ యూజర్లుగా వాట్సప్ యాప్ యూజర్లు నిలిచారు. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ కామెడీ.. పాక్‌లో నవ్వులు) -
దేశంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసిన యాప్ ఇదే!
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. 2020లో భారతదేశంలో మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసే వారి శాతం 28% పెరిగినట్లు ఒక నివేదికలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ యాప్ డౌన్లోడ్ పరంగా చూస్తే చైనా మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న భారత్ ఉంది. మొబైల్ డేటా ఎనలిటిక్స్ ఫ్లాట్ ఫారం యాప్ అన్నీ(Annie) విడుదల చేసిన మొబైల్ మార్కెట్ స్పాట్ లైట్ రిపోర్ట్ 2021 నివేదికలో ఈ విషయం బయట పడింది. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ప్రపంచ యాప్ మార్కెట్లో బూమ్ ఏర్పడినట్లు ఈ నివేదిక హైలైట్ చేసింది. డౌన్లోడ్ పరంగా చూస్తే గేమ్ యాప్స్, సోషల్ యాప్స్, ఎంటర్ టైన్ మెంట్ యాప్స్‌ను అత్యధికంగా డౌన్లోడ్ చేశారు. ఇందులో అధికంగా యూట్యూబ్, వాట్సాప్ మెసెంజర్, ఫేస్బుక్ యాప్స్‌ను ఎక్కువగా డౌన్లోడ్ చేసినట్లు నివేదిక తెలిపింది. 2020లో భారతీయులు 651 బిలియన్ గంటలు ఆన్లైన్లో గడిపారు. మన దేశంలో ఒక సగటు మొబైల్ వినియోగదారుడు ప్రతిరోజూ ఫోన్లలో 4.8 గంటలు గడిపారని తెలిపింది. 2019లో రోజుకు 3.3 గంటల నుంచి 40 శాతం పెరిగింది.కోవిడ్-19 మహమ్మారి సమయంలో మొబైల్ వాడకం భారీగా పెరిగిన సంగతి మనకు తెలిసిందే. కరోనా రాకముందు కంటే 2021లో మొబైల్ వాడకం 80 శాతం పెరిగింది. (చదవండి: పెట్రోల్ ధరల ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర వస్తువల ధరలు) ఆండ్రాయిడ్ గేమింగ్ యాప్స్ భారతదేశంలో తమ పట్టు నిలుపుకున్నాయి. 2021 హెచ్1లో గేమ్ డౌన్లోడ్ సంఖ్య 4.8 బిలియన్లకు చేరుకుంది. 2021 హెచ్1లో భారతదేశంలో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన గేమ్ యాప్ గా లుడో కింగ్ నిలిచింది. ఆ తర్వాత స్థానాలలో ఫౌజీ, క్యారమ్ పూల్ నిలిచాయి. ఇక పెట్టుబడి యాప్స్ విషయానికి వస్తే అప్ స్టోక్స్ మొదటి స్థానంలో నిలిస్తే.. ఆ తర్వాత స్థానాలలో వజీర్ఎక్స్, కాయిన్ స్విచ్ వంటి క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ యాప్స్ నిలిచాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) కూడా వినియోగదారులకు ఆసక్తి కలిగించింది. యుపీఐ లావాదేవీల పరిమాణం క్యూ2 2021లో దాదాపు ఎనిమిది బిలియన్లకు చేరుకుంది. (చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త!) -
Anie Siva: ఐస్‌క్రీమ్‌లు అమ్మిన ఊరికే ఎస్ఐగా వచ్చింది!
మలయాళ నటుడు మోహన్‌లాన్ ‘ఆమె కథ అందరికీ స్ఫూర్తి కావాలి’ అని ఫేస్బుక్లో రాశాడు. కేరళ ప్రతిపక్ష నాయకుడు సతీశన్ ‘ఓహో... ఏమి పట్టుదల’ అని శ్లాఘించాడు. కేరళ డిజిపి లోక్‌నాథ్ బెహరా ‘నీకేం కావాలో చెప్పమ్మా’ అని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ ‘ఆనీ శివ’ అనే కొత్త మహిళా ఎస్.ఐ గురించి. జూన్ 25న ఆమె ఎస్.ఐ అయ్యింది అక్కడ. పదేళ్ల క్రితం భర్త, తల్లిదండ్రులు వదిలేయగా ఏ ఊళ్లో అయితే నిమ్మరసం, ఐస్‌క్రీమ్‌లు అమ్ముతూ వచ్చిందో అదే ఊరికి ఆమె ఎస్.ఐ. అయ్యింది. ‘నా పాతరోజుల మీద ఇంతకు మించి ఏం ప్రతీకారం తీర్చుకోను’ అందామె. మనం పేడముద్దలా ఉంటే జీవితం విసిరికొట్టినప్పుడు హరీమంటాం. బంతిలా ఉంటే ఆనీ అవుతాం. ఆమె కథ ఇది. రెండు మూడు రోజులుగా కేరళలో ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ వార్తల్లో ఉంది. సాధారణంగా ఇలా సినిమాల్లో జరుగుతుంటుంది. అయితే కల్పన కంటే నిజ జీవితంలోనే ఎంతో అనూహ్యత ఉంటుంది. అందుకే ఆనీ శివ జీవితం ఇప్పుడు చాలామందికి స్ఫూర్తికానుంది. ఒక విశేష నియామకం త్రివేండ్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే వర్కల అనే టౌన్‌కు జూన్ 25న ఆనీ శివ సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చింది. అది ఆమెకు తొలిపోస్టు. అంతకుముందు ఆమె రెండు సంవత్సరాలుగా కొచ్చిలో ట్రయినింగ్ లో ఉంది. అది పూర్తి కావడంతో వర్కలకు పోస్టింగ్ ఇచ్చారు. మామూలుగా అయితే అసలు ఇది ఏ మాత్రం చెప్పుకోదగ్గ వార్త కాదు. కాని వర్కలకు ఆనీ శివ ఎస్.ఐగా రావడం మాత్రం పెద్ద వార్త. ఎందుకంటే పదేళ్ల క్రితం అదే టౌన్లో ఆమె పొట్టకూటి కోసం నిమ్మకాయ రసం అమ్మింది. ఐస్‌క్రీమ్‌లు అమ్మింది. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేసింది. సరుకులు ఇంటింటికి తిరిగి అందించే బాయ్‌గా పని చేసింది. వేయి పనులు చేసింది బతకడానికి. ఎందుకంటే ఆమె భర్త వదిలిపెట్టిన గతి లేని స్త్రీ. పైగా ఒక బిడ్డకు తల్లి. కన్నవాళ్లు తన్ని తరిమేసిన మహిళ. అలాంటి మహిళ ఆ ఊళ్లో బతికింది. కాని ఇవాళ అదే మహిళ ఆ ఊరికే ఎస్.ఐగా తిరిగొచ్చింది. ప్రేమ–వంచన త్రివేండ్రంకు గంట దూరంలో ఉండే కంజీరంకులమ్ అనే చిన్న ఊరికి చెందిన ఆన్నీ శివ తను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా ప్రేమించిన కుర్రాడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఏమాత్రం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ప్రేమించినవాడు ఆమెతో వర్కలలో కాపురం పెట్టాడు. ఒక కొడుకు పుట్టాడు. అప్పటికి ఆమె పట్ల విముఖత ఏర్పరుచుకున్న అతడు ఆమెను ఆమె ఖర్మానికి వదిలి వెళ్లిపోయాడు. జీవితంలో దెబ్బ తిన్న ఆనీ శివ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ‘గడప ఎక్కావంటే కాళ్లు విరగ్గొడతాం’ అన్నారు. దాంతో గతి లేక వర్కల వచ్చి అక్కడ ఉంటున్న నానమ్మ ఇంట్లోని స్థలంలో చిన్న షెడ్ వేసుకుని జీవించసాగింది. ఆమె తల్లి, అన్న, తండ్రి కొడుకు పేరు శివ స్వరూప్. కొడుకును సాకడానికి ఆనీ శివ నిమ్మకాయరసం, ఐస్‌క్రీమ్‌లు అమ్మింది. వర్కల పుణ్యక్షేత్రం. అక్కడ గుడి చాలా ఫేమస్. పాపనాశం బీచ్‌లో మునిగితే పాపాలు పోతాయని నమ్మిక. అందుకని యాత్రికులు వస్తుంటారు. వారికి తినుబండారాలు అమ్మేది. ఆ డబ్బు చాలక ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారింది. ఇంకా ఏ పని దొరికితే అది. ఆమె తను స్త్రీగా ఉంటే ఇబ్బంది అని పూర్తిగా అబ్బాయి క్రాఫ్‌లో తిరిగేది. చూసేవారు ఆమెతో ఉన్న కొడుక్కు అన్నగాని తండ్రి గాని అనుకునేవారు. ఇన్ని పనులు చేస్తూనే ఆన్నీ తన చదువు తిరిగి కొనసాగించింది. కష్టపడి డిగ్రీ సోషియాలజీ పూర్తి చేసింది. స్నేహితుని సలహా ఆమె చురుకుదనం, శరీర స్వభావం గమనించిన మిత్రుడు నువ్వు పోలీసాఫీసర్‌గా సరిపోతావు.. ట్రై చెయ్ అని సలహా ఇచ్చాడు. దాంతో ఆనీ నియామక పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం మొదలెట్టింది. 2016లో ఆమె మహిళా కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె లక్ష్యం ఎస్.ఐ కావడం వల్ల తిరిగి పరీక్షలు రాయడం కొనసాగించి 2019లో ఎస్.ఐగా సెలెక్ట్ అయ్యింది. ట్రైనింగ్, ప్రొబేషన్ పూర్తయ్యాక తన ఊరికే ఎస్.ఐగా వచ్చింది. ప్రశంసల వెల్లువ ఆమె పోస్టింగ్ తీసుకున్న వెంటనే ఆమె జీవితం గురించి అక్కడ విశేష కథనాలు రావడంతో కేరళలో ఆనీకు ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమా, రాజకీయ రంగాలలోని ప్రముఖులు ఆమె తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనాన్ని చాలా ప్రశంసించారు. ‘ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తి కావాలి’ అని మోహన్‌లాల్‌తో సహా అందరూ కోరుకున్నారు. ఆనీకి కూడా తన విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ‘నన్ను బాధించిన పాతరోజుల మీద ఇంతకు మించి ఏం ప్రతీకారం తీర్చుకోను?’ అని అంది. తన ఇంటర్వ్యూలలో తన కొడుకు కొచ్చిలో చదువుకుంటున్నాడని, ట్రయినింగ్ సమయంలో అక్కడే స్కూల్లో వేశానని, ఇప్పుడు ఇద్దరం వేరు వేరుగా ఉండాల్సి వస్తోందని అందామె. అది చదివిన కేరళ డిజిపి వెంటనే కొచ్చికి బదిలీ చేశారు. తల్లీకొడుకులను కలపడానికి ఈ ట్రాన్స్ఫర్ చేశాం అని ఆయన తెలియచేశారు. లోకం మారాలి వివాహంలో విభేదం వచ్చి కూతురు పుట్టింటికి వస్తే అక్కున చేర్చుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగానే ఉంటారు. కాని లోకులే సూటిపోటి మాటలు అంటుంటారు. లోకులకు భయపడి తల్లిదండ్రులు తమ కూతుళ్లను వారి ఖర్మానికి వదిలిపెడుతున్నారు. లోకుల ధోరణి మారాలి. అప్పుడు వివాహిత స్త్రీలు తమకు తల్లిదండ్రుల అండ ఉంది అనుకుంటారు. ఆత్మహత్యల వరకూ వెళ్లరు అంది ఆనీ. – సాక్షి ఫ్యామిలీ -
‘రాజన్న’ మూవీ చిన్నారి.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో హీరో నాగార్జున అక్కినేని లీడ్‌రోల్ వచ్చిన మూవీ ‘రాజన్న’. ఇందులో నాగార్జున స్వంతంత్య్ర సమరయోధుడు రాజన్నగా కనిపించగా ఆయనకు భార్యగా నటి స్నేహ నటించింది. 2011లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది, ఇక ఇందులో రాజన్న కూతురు మల్లమ్మగా నటించిన ఆ చిన్నారి తన నటనతో ప్రేక్షకులను విపరితంగా ఆకట్టుకుంది. శత్రువులను ఎదురించి తన తండ్రి జాడ తెలుసుకునేందుకు ఆమె చేసే ప్రయత్నం ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇక మల్లమ్మగా తన తండ్రి రాజన్న చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని పాటల రూపంలో తెలుపుతూ ఇతరులలో స్ఫూర్తిని నింపుతుంది. అలా అంతగా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ చిన్నారి అసలు పేరు అనీ. ఈ సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆరిస్టుగా నంది అవార్డు గెలుచుకున్న అనీ ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా!. కాగా రాజన్న మూవీ సమయంలో అనీ వయసు 10 ఏళ్లు. ఆమె నాలుగేళ్ల వయసు నుంచే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. ‘అనుకోకుండ ఒకరోజు’ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన అనీ ఆ తర్వాత తెలుగు సీరియల్ గోరింటాకుతో పాటు పలు సీరియల్స్‌లో నటించింది. ఇక చివరగా ‘రంగస్థలం’ మూవీలో చిట్టిబాబుకు(రామ్ చరణ్) చెల్లి పాత్రలో కనిపించిన బేబీ అనీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అవినాష్ డిగ్రీ కాలేజీలో కామర్స్ చదువుతుంది. -
రాజన్న ఫేమ్ మల్లమ్మ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
-
రాజన్నలో నాగార్జున కూతురు మల్లమ్మగా చేసిన ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
-
ఒక రోజు అమ్మాయిగా, మరో రోజు అబ్బాయిగా....
సిడ్నీ: ‘అన్నీ’ అనే ఆస్ట్రేలియాకు చెందిన విద్యార్థి లేదా విద్యార్థిని చాలా చిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక రోజు మగవాడిలా, మరో రోజు ఆడపిల్లలా ప్రవర్తిస్తున్నారు. ఒక రోజు నెత్తిన ఫూలు పెట్టుకొని స్కర్టు వేసుకుంటే మరో రోజు క్రాఫ్ దువ్వుకొని కోటు వేసుకుంటున్నారు. ఆమె లేదా అతనికి ఇప్పుడు 12 ఏళ్లు. ప్రధానంగా పదవ ఏటనే ఈ సమస్య ఉత్పన్నమైంది. ‘అన్నీ’ని చిన్నప్పటి నుంచి అమ్మాయిలాగా పెంచారు. పదవ ఏట అడుగుపెట్టగానే పురుష లక్షణాలు బయటపడ్డాయి. పోనీ పురుషుడిగా గుర్తిద్దామంటే వారం రోజులకన్నా ఎక్కువగా ఆ లక్షణాలు ఉండడం లేదు. మళ్లీ ఆడ లక్షణాలు వస్తున్నాయి. అలా మొదట వారానికోసారి మారే ఆడ, మగ లక్షణాలు ఇప్పుడు రోజు రోజుకు మారుతున్నాయి. ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘జెండర్ ఫ్లూయిడ్ లేదా నాన్ బైనరీ చిల్డ్రన్’ అని పిలుస్తారు. ‘నేను ఓ రోజు మార్నింగ్ వాక్కు వెళ్లిరాగానే నేను పూర్తిగా మగవాడినని అనిపిస్తుంది. నూటికి నూరు శాతం మగవాడిననే విశ్వసిస్తాను. అలాగే ప్రవర్తిస్తాను. మరో రోజు ఆడపిల్లననిపిస్తుంది. నాకు తెలియకుండానే నేను అచ్చం ఆడపిల్లలానే ప్రవర్తిస్తుంటాను. కొన్ని సార్లు నేను ఆడపిల్లనా, మగ పిల్లవాడినా కూడా నాకు అర్థం కాదు. ఇంతకుమించి నాకు ఏమీ తెలియదు’ అని అన్నీ బుధవారం మీడియాతో వ్యాఖ్యానించింది. ‘మా అమ్మాయి లేదా అబ్బాయి రోజుకోరకంగా ప్రవర్తిస్తున్నారు. ఒక రోజు అబ్బాయిలా, మరో రోజు అమ్మాయిలా మారిపోతున్నారు. ఒక్కొక్కసారి రెండూలా ప్రవర్తిస్తున్నారు. వైద్యులకు చూపించినా సమస్య పరిష్కారం అవడం లేదు. వయస్సు పెరుగుతున్నా కొద్దీ మగవాడిలా లేదా ఆడామెలా బలమైన లక్షణాలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. శారీరకంగా కంటే మానసికంగానే ఆడ లేదా మగ లక్షణాలు ఎక్కువ ఉంటున్నాయి’ అని అన్నీ తల్లి మారిట వివరించారు. మొదట్లో అన్నీకి ఏ దుస్తులు కొనాలన్నది పెద్ద సమస్యగా ఉండేదని, అందుకనే రెండు రకాల దుస్తులు కొనడం అలవాటు చేసుకున్నామని ఆమె చెప్పారు. అన్నీకి స్కూల్లో కూడా సమస్యలు వస్తున్నాయి. ఓ రోజు బాయ్స్ టాయ్లెట్లోకి వెళితే మరో రోజు గర్ల్స్ టాయ్లెట్లోకి వెళ్లడం అన్నీకే కాకుండా తోటి పిల్లలకు ఇబ్బందిగా తయారయింది. అమ్మాయిలు, అబ్బాయిలతో కలుపుగోలుగా తిరగడం కూడా అన్నీకి ఇబ్బందిగా ఉంటోంది. -
అన్నయ్యే అన్నీ..
రాజన్న సినిమాలో ‘అమ్మా అవని..’ అంటూ అభినయించిన బాలనటి అనీ అంటే ఆ అన్నకు ప్రాణం. ఎంతలా అంటే ఆ ముద్దుల చెల్లెలు పేరును చేతిపై టాటూ వేయించుకునేంత. అనీ తొమ్మిదో తరగతి చదువుతుంటే.. అన్నయ్య ఆశిష్ బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నాడు. ఏజ్ గ్యాప్ ఏడేళ్లున్నా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. చెల్లెలి వల్లే తమ ఫ్యామిలీకి గుర్తింపు వచ్చిందంటాడు ఆ అన్న. నాకు అన్నీ అన్నయ్యే అంటుంది చెల్లి. అలగడం హాబీగా ఉన్న చెల్లిని ఓదార్చడం అన్నకు ఇష్టం. టీవీలో యాంకర్లను చూసి.. అద్దం ముందు చెల్లెలు చేసే అభినయం మరింత ఇష్టం. చెల్లెలు గిఫ్ట్‌గా ఇచ్చిన షర్ట్ వేసుకుంటే ఎక్కడ పాడైపోతుందోనని.. బీరువాలో భద్రంగా దాచుకోవడం ఎంతో ఇష్టం. చిన్న వయసులోనే ఎంతో పరిణ తితో ఆలోచించే అనీ.. తనకు అక్కలా మాట్లాడుతుందని మురిసిపోతూ చెప్తాడు ఆశిష్. నటన తన చెల్లికి దేవుడిచ్చిన వరమని చెబుతున్న ఆశిష్.. అనీ పెద్దయిన తర్వాత మంచి నటిగానో.. యాంకర్గానో స్థిరపడాలని కోరుకుంటున్నాడు. షూటింగ్‌లతో అన్నయ్యను మిస్సయినా.. ఆయన పంచే అనురాగాన్ని మాత్రం మిస్సయ్యేది లేదంటోంది అనీ. రాఖీ పండుగ రోజు షూటింగ్‌కు వెళ్లాల్సి రావడం బాధగా ఉంటుందని చెబుతోంది. ‘ఆ రోజు అన్నయ్య నిద్ర లేవక ముందే చేతికి రాఖీ కట్టి ముద్దు పెట్టి షూటింగ్‌కు వెళ్లిపోతాను. నేను షూటింగ్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేసి మరీ అన్నయ్య మంచి గిఫ్ట్ ఇస్తాడు’ అని ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అనీ మనముందుంచింది.