Vikramarkudu Movie Child Artist Neha Thota, Know Whats She Doing Now - Sakshi
Sakshi News home page

Vikramarkudu Movie: రవితేజ కూతురిగా మెప్పించింది.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

Apr 15 2023 3:29 PM | Updated on Apr 15 2023 4:35 PM

Vikramarkudu Movie Child Artist Neha Thota Whats Doing Now - Sakshi

సినీ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. వారిలో కొందరు స్టార్స్‌గా మారితే.. మరికొందరేమో కొన్ని సినిమాలతోనే సరి పెట్టుకున్నారు. కొద్ది మంది ఒక్క సినిమాలో కనిపించి కనుమరుగైన పోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఓ సూపర్‌ హిట్ చిత్రంలో మెప్పించిన ఓ చిన్నారి ఇప్పుడెలా ఉందో ఓ లుక్కేద్దాం.

రవితేజ డబుల్‌ రోల్‌లో నటించిన బ్లాక్‌ బస్టర్‌ హిట్ 'విక్రమార్కుడు'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లోని చంబల్‌ ప్రాంతంలో జరిగిన కథను సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి మీకు గుర్తుందా? 'అమ్మ పాట వింటే నిద్ర వచ్చేస్తుంది నాన్న' అంటూ అమాయకంగా పలికిన ఆ చిన్నారి ఇప్పుడేం చేస్తోందో తెలుసా? ఆ వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం. 

విక్రమార్కడులో చైల్డ్ ఆర్టిస్ట్‌ నేహా చాలా సినిమాల్లో నటించింది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురిగా.. అమాయకమైన పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఈ సినిమాలో నటనకు ఆ చిన్నారిని మెచ్చుకున్నారు. అనసూయ, రాముడు, ఆది విష్ణు, రక్ష, సర్కార్ చిత్రాల్లో కూడా కనిపించింది. 

కాగా.. అమెరికాలోని ఫ్లోరిడాలో నేహా జన్మించింది. అయితే చిన్నప్పుడే ఆ పాప తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె తల్లిదండ్రులు  ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందినవారు. నేహా దాదాపు పదేళ్లకు పైగా సినిమాల్లో నటించడం లేదు. అయితే ఆమె ప్రస్తుతం సినిమాల కంటే కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవలే ఎంబీఏ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement