Is Yashasvi Jaiswal Acted In Ravi Teja's Blockbuster Vikramarkudu Movie ? - Sakshi
Sakshi News home page

Yashasvi Jaiswal: విక్రమార్కుడులో యశస్వి జైస్వాల్.. ఆ సీన్‌లో ఉన్నది అతనేనా?

Published Sat, Jul 15 2023 10:54 AM | Last Updated on Sat, Jul 15 2023 5:58 PM

Yashasvi Jaiswal Acts In Raviteja Block Buster Movie Vikramarkudu - Sakshi

టీమిండియా యువ సంచలనం ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరితో అదరగొట్టాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన యువకెరటం ఏకంగా టీమిండియా తలుపుతట్టాడు. వెస్టిండీస్‌ పర్యటనకు ఒపెనర్‌గా ఎంపికయ్యాడు. ఇంకేముంది అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టి ఔరా అనిపించాడు. అతనే టీమిండియా యువకెరటం యశస్వి జైశ్వాల్. అయితే తాజాగా యశస్వి జైస్వాల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ యంగ్ ఒపెనర్ టాలీవుడ్‌ స్టార్ హీరో సినిమాలో నటించారంటూ మీమ్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!)

మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్‌ మూవీ విక్రమార్కుడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని చంబల్‌ ప్రాంతంలో జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ఓ సీన్‌లో అచ్చం యశస్వి జైస్వాల్‌ లాగే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించాడు. అది కూడా క్రికెట్ ఆడుతున్న సీన్ కావడంతో అందరూ చిన్నప్పుడు ఆ సీన్‌లో ఉన్నది యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విక్రమార్కుడు చిత్రంలోని చైల్డ్ ఆర్టిస్ట్‌కు, అతనికి పోలికలు ఉండటంతో నెటిజన్స్ మీమ్స్‌  చేస్తున్నారు. 

'ఏ సత్తి బాల్ లోపలికి వచ్చిందా?' అనే డైలాగ్ చెప్పిన పిల్లాడు ఇప్పుడు టీమిండియా ఒపెనర్‌కు దగ్గర పోలికలు ఉండడంతోనే అలా పోలుస్తున్నారు. అంతేకానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశస్వి జైస్వాల్ టాలీవుడ్‌లోనే ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం అతను టీమిండియాలో చోటు దక్కించుకోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

(ఇది చదవండి: మీరు ఇంత దారుణంగా ఉన్నారేంట్రా?.. అనసూయ ట్వీట్ వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement