కొంత మంది సినిమా కళ కోసమే పుడతారేమో అనిపిస్తుంది వాళ్ల నటనాతృష్ణను చూస్తుంటే! ఆ వరుసలో నటి నిత్యా శెట్టినీ చేర్చొచ్చు. బాలనటిగా వెండితెర మీద పరిచయమై.. ఇప్పుడు హీరోయిన్‌గా రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇటు వెబ్ తెర అవకాశాలనూ అందుకుంటోంది.
► చిన్నప్పుడు షూటింగ్‌లో అందరూ నన్ను గారాబం చేసేవాళ్లు. బోల్డన్ని చాక్లెట్లు ఇచ్చేవాళ్లు. అప్పుడు వాటన్నింటినీ ఎంతో ఇష్టంగా తినేదాన్ని. కానీ, ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నా. హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి కదా.
► నిత్యా శెట్టి నిత్యా పుట్టింది, పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్‌లోనే. ఇంజినీరింగ్ పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కొంతకాలం పనిచేసింది కూడా. స్కూల్ డేస్‌లోనే బాలనటిగా ‘దేవుళ్లు’, ‘అంజి’ వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
► ‘చిన్ని చిన్ని ఆశ’, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాల్లోని నటనకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డులూ అందుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్’, ‘పడేసావే’ చిత్రాల్లోనూ, కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించింది.
► ‘నువ్వు తోపురా’ సినిమాతో కథానాయికగా నిత్యా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చినా పెద్దగా పేరు రాలేదు. అయితే, ఆమే హీరోయిన్‌గా ఈ మధ్యనే వచ్చిన ‘ఓ పిట్ట కథ’ మంచి విజయం సాధించింది. ఇందులోని నిత్యా నటన ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతోన్న ‘హలో వరల్డ్’ సిరీస్‌తో వీక్షకులను అలరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment