మీరు ఏ సినిమా తీసుకున్నా హీరోహీరోయిన్లతో పాటు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. తమకు లభించన అవకాశాల్ని ఉపయోగించుకుని క్యూట్ యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఈ పాప కూడా సేమ్ అలానే. మనకు బాగా తెలిసిన ఓ సినిమాలో హీరోయిన్‌కి చెల్లిగా నటించింది. ఇప్పుడేమో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారైంది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున‍్న అమ్మాయి పేరు గాబ్రియోలా నటాలియా ఛార్లటెన్. కాకపోతే గాబ్రియోలా అనే పేరుతో ఫేమస్ అయింది. ప్రస్తుతం సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈమె.. తొమ్మిదేళ్ల వయసులో కెరీర్ ప్రారంభించింది. ఓ ఛానెల్ లో ప్రసారమైన డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. అలానే ఓ సబ్బుకి సంబంధించిన యాడ్ లోనూ నటించింది. దీని తర్వాత 'జోడీ నెంబర్ వన్' అనే డ్యాన్స్ షోలో విజేతగా నిలిచింది.
(ఇదీ చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?)
ఇలా బుల్లితెరపై ఆకట్టుకున్న ఈమెకు ధనుష్-శ్రుతిహాసన్ నటించిన 'త్రీ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం దక్కించుకుంది. ఇందులో హీరోయిన్ చెల్లిలి పాత్రలో కనిపించింది. కొన్ని సీన్లలో కనిపించి ఆకట్టుకుంది. చెన్నైయిల్ ఒరు నాళ్, అప్ప చిత్రాల్లోనూ నటించింది. బిగ్ బాస్ తమిళ్ నాలుగో సీజన్ లోనూ పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం మాత్రం 'ఈర్మన రోజావే 2' సీరియల్ లో కావ్య పార్తిబన్ అనే గృహిణి పాత్ర చేస్తోంది.
అయితే 'త్రీ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా క్యూట్ గా కనిపించిన గాబ్రియోలా.. సీరియల్స్ లో చీరకట్టుతో పద్ధతిగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం అస్సలు తగ్గట్లేదు. మోడ్రన్ డ్రస్సులు ధరిస్తున్నప్పటికీ గ్లామర్‌తో కట్టిపడేస్తోంది. అవి చూస్తున్న కుర్రాళ్లు.. ఎవరీ బ్యూటీ అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా?
(ఇదీ చదవండి: గద్దర్ నటించిన చివరి సినిమా ఇదే)
Comments
Please login to add a commentAdd a comment