Gabriella
-
శారీ లుక్‌లో గాబ్రియెల్లా.. ఫుల్‌గా చిల్ అవుతోన్న ఆషిక రంగనాథ్!
►ఫ్లైట్‌లో బాలీవుడ్ భామ రవీనాటాండన్ ఫోజులు! ►దయా లుక్‌లో యాంకర్ విష్ణుప్రియ! ►చిల్ అవుతున్న పోజులిస్తున్న ఆషిక రంగనాథ్! ►సంప్రదాయ శారీ లుక్‌లో గాబ్రియెల్లా! ►వైట్ డ్రెస్‌లో యషిక ఆనంద్ హాట్ లుక్స్! View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Gabriella (@gabriellacharlton_) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
అప్పుడేమో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో హీరోయిన్! (ఫోటోలు)
-
ఈ పాప గుర్తుందా? ఆ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో
మీరు ఏ సినిమా తీసుకున్నా హీరోహీరోయిన్లతో పాటు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. తమకు లభించన అవకాశాల్ని ఉపయోగించుకుని క్యూట్ యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఈ పాప కూడా సేమ్ అలానే. మనకు బాగా తెలిసిన ఓ సినిమాలో హీరోయిన్‌కి చెల్లిగా నటించింది. ఇప్పుడేమో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారైంది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు గాబ్రియోలా నటాలియా ఛార్లటెన్. కాకపోతే గాబ్రియోలా అనే పేరుతో ఫేమస్ అయింది. ప్రస్తుతం సీరియల్స్‌లో హీరోయిన్గా నటిస్తున్న ఈమె.. తొమ్మిదేళ్ల వయసులో కెరీర్ ప్రారంభించింది. ఓ ఛానెల్ లో ప్రసారమైన డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. అలానే ఓ సబ్బుకి సంబంధించిన యాడ్ లోనూ నటించింది. దీని తర్వాత 'జోడీ నెంబర్ వన్' అనే డ్యాన్స్ షోలో విజేతగా నిలిచింది. (ఇదీ చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?) ఇలా బుల్లితెరపై ఆకట్టుకున్న ఈమెకు ధనుష్-శ్రుతిహాసన్ నటించిన 'త్రీ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం దక్కించుకుంది. ఇందులో హీరోయిన్ చెల్లిలి పాత్రలో కనిపించింది. కొన్ని సీన్లలో కనిపించి ఆకట్టుకుంది. చెన్నైయిల్ ఒరు నాళ్, అప్ప చిత్రాల్లోనూ నటించింది. బిగ్ బాస్ తమిళ్ నాలుగో సీజన్ లోనూ పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం మాత్రం 'ఈర్మన రోజావే 2' సీరియల్ లో కావ్య పార్తిబన్ అనే గృహిణి పాత్ర చేస్తోంది. అయితే 'త్రీ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా క్యూట్ గా కనిపించిన గాబ్రియోలా.. సీరియల్స్ లో చీరకట్టుతో పద్ధతిగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం అస్సలు తగ్గట్లేదు. మోడ్రన్ డ్రస్సులు ధరిస్తున్నప్పటికీ గ్లామర్‌తో కట్టిపడేస్తోంది. అవి చూస్తున్న కుర్రాళ్లు.. ఎవరీ బ్యూటీ అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: గద్దర్ నటించిన చివరి సినిమా ఇదే) -
నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?
ప్రేమకు పెళ్లితో పనేంటి? అవును, మీరు విన్నది నిజమే.. ప్రేమకు పెళ్లితో పనేంటి? అంటున్నారు బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ రాంపాల్- గాబ్రెల్లా డెమట్రేడ్స్. ప్రేమించుకున్నాం, మాకు నచ్చినట్లుగా కలిసి జీవిస్తున్నాం.. ఇంకేంకావాలి? పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అని ముందుకు సాగుతున్నారు. నాలుగున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంటకు ఓ బాబు సంతానం కాగా ప్రస్తుతం గాబ్రెల్లా రెండోసారి గర్భం దాల్చింది. అయితే పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్న ఈ జంటపై కొందరు నెటిజన్లు అదేపనిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తనను టార్గెట్ చేసిన ఓ నెటిజన్‌కు చురకలేసింది నటి. తాజాగా గాబ్రెల్లా వీకెండ్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బేబీ బంప్ పిక్ కూడా ఉంది. ఇది చూసిన ఓ నెటిజన్.. 'మీరు ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? మీరు మీ దేశంలో లేరు ఇండియాలో ఉన్నారు. మీరిద్దరూ కలిసి యూత్‌ను చెడగొడుతున్నారు' అని కామెంట్ చేశాడు. దీనికి గాబ్రెల్లా స్పందిస్తూ.. 'అవును నిజమే, నీలాంటి మూర్ఖులకు బదులుగా అందమైన చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువస్తుండటమే మేము చేసిన తప్పు' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. కాగా అర్జున్ రాంపాల్ గతంలో మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. 1998లో భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ఆరంభించిన వీరిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2018లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2019లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది గాబ్రెల్లాను తన ప్రేయసి అంటూ అభిమానులకు పరిచయం చేశాడు, అది కూడా తను గర్భం దాల్చిందన్న వార్తతో! View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) చదవండి: పెళ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి, ఫోటోలు వైరల్ -
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు..క్రేజీ కపుల్
-
'నా భార్యను విడిచిపెట్టండి'
నెల రోజుల క్రితం వారిద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. రెండు వారాల ఎడబాటు తర్వాత కలుసుకోబోతున్నందుకు ఆ దంపతులు ఎంతో సంతోషించారు. కానీ వారిద్దరూ కలుసుకోలేకపోయారు. భర్తను కలుసుకునేందుకు బయలు దేరిన భార్యను మధ్యలోనే అరెస్ట్ చేయడంతో వీరి కథ కొత్త మలుపు తిరిగింది. భార్య విడుదల కోసం భర్త ప్రయత్నాలు మొదలు పెట్టాడు. మీడియా ద్వారా తన ఆవేదనను వెల్లడించాడు. బ్రిటన్ కు చెందిన రిచర్డ్ రాట్ క్లిఫ్, నజానిన్ జఘారి దంపతులు. వీరికి 22 నెలల గాబ్రియల్ అనే కూతురు ఉంది. సెలవుల్లో తన కూతురితో కలిసి నజానిన్ తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఇరాన్ కు వెళ్లింది. ఏప్రిల్ 2న ఆమె తన భర్తతో ఫోన్ లో మాట్లాడింది. తర్వాతి రోజు బ్రిటన్ కు బయలు దేరేందుకు టెహ్రాన్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడ ఆమెను అరెస్ట్ చేసి ఒంటరిగా బంధించారని రిచర్డ్ ఆరోపించాడు. కూతురు, లాయర్ ను కలవకుండా గుర్తు తెలియని జైలులో ఆమెను నిర్బంధించారని వాపోయాడు. అరెస్ట్ చేసినప్పటి నుంచి తనతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని తెలిపాడు. ద్వంద్వ పౌరసత్వం కలిగిన తన భార్యను ఎందుకు అరెస్ట్ చేశారో ఇరాన్ అధికారులు వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నజానిన్ అరెస్ట్ గురించి తమకేం తెలియదని ఇరాన్ విదేశాంగ చెబుతోందన్నాడు. లండన్ లోని ఇరాన్ ఎంబసీ కూడా స్పందించడం లేదని వాపోయాడు. 41 ఏళ్ల రిచర్డ్ ఉత్తర లండన్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. నజానిన్(37) థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ గా పనిచేస్తోంది. అయితే ఇరాన్ లో ఆమెకు ఎటువంటి ప్రొఫెనల్ డీలింగ్ లేవని థామ్సన్ సంస్థ స్పష్టం చేసింది. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో రిచర్డ్ మీడియాకు ఎక్కాడు. సీఎన్ఎన్ వార్తా సంస్థతో తన గోడు వెళ్లబోసుకున్నాడు.