హీరోయిన్ సుహాని కలిత గుర్తుందా..అదేనండి 'మనసంతా నువ్వే' సినిమాలో 'తూనీగ తూనీగ'.. అంటూ కనిపించిన చిన్నారి. బాల రామాయణం సినిమాతో తెలుగు తెరకు పరిచయయం అయిన ఆమె గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించింది. ఆ సమయంలోనే తెలుగు సహా తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడా సినిమాలు చేసింది.
ఈ చిన్నదాని క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కొన్ని బడా కంపెనీలు సుహానీని బ్రాండ్ అంబాసిండర్‌గా నియమించుకున్నాయి. అలా ఆమె నీరూస్, శామ్‌సంగ్, ఆర్‌ఎస్ బ్రదర్స్ సహా పలు బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సుహానీ 2008లో బి. జయ దర్శకత్వంలో సవాల్ అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డును గెలుచుకుంది.
ఆ తర్వాత స్నేహగీతం, శ్రీశైలం వంటి సినిమాల్లో నటించినా ఈమెకు అంతగా కలిసిరాలేదు. చెల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన పాపులారిటీ..హీరోయిన్‌గా మాత్రం రాలేదు. ఇప్పటివరకు వివిధ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం యాక్టింగ్ కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కథ నచ్చితే మళ్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment