'తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..' అంటూ ఆడిపాడిన చిన్నారి గుర్తుందా! మనసంతా నువ్వే సినిమాలో చైల్డ్ ఆర్డిస్ట్‌గా నటించిన ఈమె పేరు సుహాని కలిత. బాలనటిగానే కాకుండా హీరోయిన్‌గానూ మెప్పించిన ఆమె తాజాగా పెళ్లిపీటలెక్కింది. సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో ఏడడుగులు నడిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయం అయింది సుహాని. ప్రేమంటే ఇదేరా, గణేష్, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో బాలనటిగా అలరించింది. తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా సినిమాలు చేసింది. పలు కంపెనీల వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించింది. 2008లో సవాల్ సినిమాతో హీరోయిన్‌గా మారింది. కానీ కథానాయికగా ఆమెకు పెద్ద గుర్తింపు రాలేదు. చివరగా ఆమె తెలుగులో 2010లో స్నేహగీతం సినిమాలో కనిపించింది.
చదవండి: పెళ్లిరోజే ఆ ముచ్చట తీరదన్న ఆలియా, మరి కత్రినా ఏమందంటే?
ఏడ్చేసిన రేవంత్, ఏం పరిస్థితి తెచ్చావు సామీ
Comments
Please login to add a commentAdd a comment