
చార్లీ 777, జాగ్వార్ లాంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్న ఐశ్వర్య గౌడ..ఇప్పుడు హీరోయిన్‌గా మారబోతుంది. మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి ప్రముఖ కథానాయకులతో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ మరియు రాస్ర ఎంటర్ టైన్మంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఏ రోజైతే చూశానో నిన్ను’ సినిమాలో ఐశ్వర్య హీరోయిన్‌గా నటించగా.. మరో చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ రామ్(బుర్రకథ, రంగ రంగ వైభవంగా) హీరోగా పరిచయం అవుతున్నాడు.
రాజు బొనగాని దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘ఈ డిసెంబర్ నెలలోనే 'ఏ రోజైతే చూశానో నిన్ను' షూటింగ్ ప్రారంభం కానుంది. భరత్ రామ్, ఐశ్వర్య గౌడ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment