Chello Show Child Actor Rahul Koli Dies Of Cancer in Ahmedabad - Sakshi
Sakshi News home page

Chello Show Child Actor : తీవ్ర విషాదం.. 'ఛెల్లో షో' మూవీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మృతి

Published Tue, Oct 11 2022 1:23 PM | Last Updated on Tue, Oct 11 2022 4:32 PM

Chello Show Child Actor Rahul Koli Dies Of Cancer in Ahmedabad - Sakshi

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను సైతం వెనక్కు నెట్టి.. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఛెల్లో షో (ద లాస్ట్ షో) సినిమాలో నటించిన బాల నటుడు రాహుల్ కోలీ (10) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న రాహుల్‌ తుదిశ్వాస విడిచాడు. కాగా  ఛెల్లో షో సినిమా ఈనెల 14న విడుదల కానుంది. అంతలోనే రాహుల్‌ మరణించడంతో చిత్రబృందంతో పాటు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

పదేపదే జ్వరం బారిన పడుతున్న రాహుల్‌, ఇటీవలె రక్తపు వాంతులు చేసుకున్నాడని రాహుల్‌ తండ్రి రాము కోలీ తెలిపారు. అక్టోబర్‌ 2న ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తము కళ్ల ముందే  బిడ్డ చనిపోయాంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీన తాము ఛెల్లో షో సినిమా చూడాలనుకున్నామని, కానీ ఇంతలోనే తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాలండూ రాహుల్‌ తండ్రి కన్నీటిపర్యంతం అయ్యాడు. 

కాగా సినిమాలపై ఎంతో ఇష్టం కలిగిన తొమ్మిదేళ్ల యువకుడి జీవితం ఎలా సాగిందన్న నేపథ్యంతో ఛెల్లో షో సినిమా సాగుతుంది. ఇందులో మొత్తం ఆరుగురు పిల్లలు నటించగా వారిలో రాహుల్ కోలీ ఒకడు. అతని మృతి పట్ల పలువురు ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement