Do You Remember Chandramukhi Child Artist Praharshetha - Sakshi
Sakshi News home page

Chandramukhi Child Artist: చంద్రముఖి చిన్నారి ఇప్పుడెలా ఉందో చూశారా? 18 ఏళ్ల తర్వాత..

Published Wed, Aug 9 2023 4:18 PM | Last Updated on Wed, Aug 9 2023 4:55 PM

Do You Remember Chandramukhi Child Artist Praharshetha - Sakshi

రజనీకాంత్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్న చిత్రాల్లో చంద్రముఖి ఒకటి. ఈ సినిమా ఇప్పుడు వచ్చినా సరే చాలామంది టీవీలకే అతుక్కుపోతారు. అంతలా ప్రేక్షకాదరణ పొందిందీ మూవీ. రజనీకాంత్‌, జ్యోతిక, నయనతార, ప్రభు, నాజర్‌, వడివేలు ప్రధాన పాత్రలు పోషించారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలైంది. త్వరలోనే దీని సీక్వెల్‌ కూడా రిలీజ్‌ కానుంది.

ఈ మూవీలో అత్తింధోం.. పాట చాలా ఫేమస్‌. ఈ పాటలో కనిపించే చిన్నారి గుర్తుందా? ముద్దుగా బొద్దుగా కనిపించే ఆమె పేరు ప్రహర్షిత శ్రీనివాసన్‌. బాలనటిగా ఎన్నో సినిమాలు, సీరియల్స్‌ చేసిన ఆమె తర్వాత ఎక్కువగా వెండితెరపై కనిపించనేలేదు. చంద్రముఖి 2 రిలీజ్‌కు రెడీ అవుతున్న సందర్భంగా ఈ చిన్నారి ఎలా ఉందోనని కొందరు నెట్టింట సెర్చ్‌ చేస్తున్నారు.

2021లో ప్రహర్షిత పెళ్లి చేసుకోగా గతేడాది ఆమెకు కూతురు పుట్టింది. 18 ఏళ్లపాటు బుల్లితెరకు దూరంగా ఉన్న ఈమె తమిళంలో ఓ కొత్త సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సోషల్‌ మీడియాలో ఫోటోషూట్లు, కూతురితో ఆడుకున్న వీడియోలు షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. తాజాగా ఆమె చంద్రముఖి సినిమాలో చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడెలా మారిపోయానో తెలియజేస్తూ వీడియో షేర్‌ చేసింది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వేరే లెవల్‌ అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

చదవండి: హైపర్‌ ఆది ఓవరాక్షన్‌.. ఇలాగైతే చిరంజీవికి కష్టమే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement