విలక్షణ దర్శకుడు తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకావ్యం జయం. ఇందులోని ప్రతి పాత్రను ఎంతో ప్రత్యేకంగా మలిచాడు డైరెక్టర్. ముఖ్యంగా అక్షరాలను తిప్పిరాసే హీరోయిన్ చెల్లెలి పాత్రను ప్రజలు ప్రేమించారు. తన నటనతో నంది అవార్డు గెలుచుకుంది. నేటికి జయం సినిమా వచ్చి 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా ప్రస్తుతం యామిని ఎక్కడుంది? ఏం చేస్తుంది? అనేది చూద్దాం..
సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురే జయం చైల్డ్ ఆర్టిస్ట్ యామిని శ్వేత. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మాత్రమే శ్వేత స్క్రీన్‌పై కనిపించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. అందుకే చిన్నతనంలో పలు పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పెద్దయ్యాక మాత్రం హీరోయిన్ కాలేకపోయింది. జయం కంటే ముందే దాదాపు 10 సీరియల్స్ చేసింది. సీతామాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలో జయం ఆడిషన్స్ కోసం ప్రకటన వచ్చింది. అది చూసి ఆమె తండ్రి తన ఫొటోలు డైరెక్టర్‌కు పంపారు. అలా హీరోయిన్ చెల్లెలిగా నటించింది.
ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు వంటి సినిమాలు చేశాక చదువుపై దృష్టి పెట్టింది. విదేశాల్లో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగం చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్‌లో స్థిరపడిపోయిన ఆమెకు ఓ కూతురు పుట్టింది. ఇకపోతే చదువుకునే సమయంలో బోలెడన్ని ఆఫర్లు వచ్చినా కూడా వాటిని సున్నితంగా తిరస్కరించింది. అందులో నచ్చావులే సినిమా కూడా ఒకటి. ఇక నంది అవార్డుకు వచ్చిన రెమ్యునరేషన్‌ను సైతం మానసిక వికలాంగుల ఆశ్రమానికి దానం చేసి గొప్ప మనసు చాటుకుంది. అయితే శ్వేత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్.
చదవండి: పెళ్లి చేసుకున్నాం, కానీ మా లైఫ్‌లో పెద్ద ఛేంజ్ ఏం లేదు
తెలుగులో వస్తున్న ఏనుగు, ట్రైలర్ చూశారా?
Comments
Please login to add a commentAdd a comment