Did You Know About Bimbisara Child Artist Baby Sridevi, Details Inside - Sakshi
Sakshi News home page

Bimbisara Movie: 'బింబిసార'లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?

Published Mon, Aug 8 2022 6:29 PM | Last Updated on Mon, Aug 8 2022 7:37 PM

Did You Know About Bimbisara Child Artist Baby Sridevi - Sakshi

త్రిగర్తల సామ్రాజ్యాధినేతగా కల్యాణ్‌ రామ్‌ అదరగొడుతున్న చిత్రం 'బింబిసార'. శుక్రవారం(ఆగస్ట్‌ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. టైమ్‌ ట్రావేల్‌ అనే సరికొత్తగా ప్రయోగం చేసిన కల్యాణ్ రామ్‌కు చాలా గ్యాప్‌ తర్వాత మంచి విజయం లభించింది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌ నటనకు, విజువల్స్‌ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

అలాగే ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా 'బింబిసార'లో చిన్నారి పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది బేబి శ్రీదేవి. త్రిగర్తల సామ్రాజ్యంలో ఆయుర్వేద పండితుడి (తనికెళ్ల భరణి) మనవరాలు శాంభవిగా, భూలోకంలో బింబిసారుడి వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్లగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బేబి శ్రీదేవి అమాయకత్వం, కల్యాణ్‌ రామ్‌తో వచ్చే సీన్లు మనసుకు హత్తుకుంటాయి. అయితే ప్రస్తుతం ఈ పాప ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ పాప ఎవరు అని సెర్చ్‌ చేస్తున్నారు. 

తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన బేబి శ్రీదేవి తల్లిదండ్రులు శ్రీహరి గౌడ్, శ్రీలక్ష్మి. వీరు హైదరాబాద్‌లో నివాసముండగా, శ్రీహరి గౌడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న బేబి శ్రీదేవి పున్నాగ, పౌర్ణమి, చెల్లెలి  కాపురం, కల్యాణ వైభోగం వంటి 15 సీరియల్లలో నటించి ఆకట్టుకుంది. అలాగే మేజర్‌, రామా రావు ఆన్‌ డ్యూటీ వంటి చిత్రాల్లో సైతం నటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement